ఓటుకు నోటు కేసు పుణ్యమా అని హైకోర్టు ఆదేశాలకు లోబడి కొడంగల్ నియోజకవర్గానికి పరిమితమైన టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తాజాగా మరోసారి చెలరేగిపోయారు. తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడటమే కాదు.. ఉమ్మడి హైకోర్టు ద్వారా తెలంగాణ సర్కారుపై పెత్తనం చేయాలని చూస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ కవిత చేసిన ఆరోపణపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క ఆంధ్రా వారిని విమర్శించే కేసీఆర్.. మరోవైపు కాంట్రాక్టులన్నీ ఆంధ్రా వారికే ఇస్తున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్ట డిజైన్ ను ఇచ్చింది ఆంధ్రాకి చెందిన సాయికి అని.. తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిన వందల కార్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి కుమారుడి షోరూంలో అని అన్నారు.
ఆంధ్రావాళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ తిడితే తెలంగాణ ప్రజల కడుపు నిండదని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి.. హైకోర్టు విభజనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ విష ప్రచారం చేస్తుందని విరుచుకుపడ్డారు. తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకోవటం కోసం చివరకు పార్లమెంటును కూడా వాడుకుంటున్నారి వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తున్న కేసీఆర్.. ఓయూలో మెస్ బిల్లులు చెల్లించటానికి మాత్రం డబ్బుల్లేవా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ 14 నెలల పాలన ఎలా ఉందో చూడటానికి ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరును చూస్తే ఇట్టే తెలిసిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణకు దశ.. దిశ నిర్దేశించిన ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరుని కూడా నిర్లక్ష్యం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని ఘాటుగా విమర్శించారు.