తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారుమీద ఆసక్తికర ఆరోపణ చేశారు. గత కొద్దికాలంగా మౌనంగా ఉన్న ఆయన తాజాగా ప్రెస్ మీట్ పెట్టేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ సందర్భంగా అన్ని దినపత్రికల మొదటిపేజీ మొత్తాన్ని యాడ్ తో కవర్ చేసిన అంశంపై ఆయన ఆసక్తికర ఆరోపణలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు భూమి పూజకు సంబంధించి అంత పెద్ద ఫోటోలు వేసుకోవటం ఏమిటంటూ మండిపడ్డ రేవంత్.. ఏమైనా అందాల పోటీకి వెళుతున్నారా? ఐశ్వర్యారాయ్ తో పోటీ పడుతున్నారా?.. మామా అల్లుళ్ల ఫోటోలు అంతేసి వేసుకోవటం ఏంటి? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ రోజు అన్నిదినపత్రికల మొదటిపేజీలో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వటాన్ని తప్పు పట్టారు. ఈ ప్రకటనతో కోట్లాది రూపాయిల ప్రజాధనం వృధా అవుతుందని.. ఇంతేసి ప్రకటనలు అవసరమా? అంటూ నిలదీశారు.
ఈ ప్రకటనలకు సంబంధించి ఒక ఆంధ్రా ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇవ్వటాన్ని రేవంత్ ప్రస్తావించారు. ఆంధ్రా ఏజెన్సీకి ఎలా కాంట్రాక్ట్ ఇస్తారని ప్రశ్నించిన రేవంత్ ప్రశ్నలకు తెలంగాణ అధికారపక్ష నేతలు ఏం సమాధానం చెబుతారో చూడాలి.