ధూంధాం అన్న తరహాలో కొంగరలో కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన బహిరంగ సభపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. బహిరంగ సభను నిర్వహిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. మధ్యయుగ చక్రవర్తి యవ్వారంలా సీఎం కేసీఆర్ తీరు ఉందన్న ఆయన.. తాజాగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ స్వయంగా చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారని.. ఆయనపై కేసు పెట్టాలని అంటున్నారు రేవంత్. చట్టాల్ని పాటించాల్సిన కేసీఆర్.. స్వయంగా చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. ఊరికో ట్రాక్టర్ తీసుకురావాలని చెప్పటం చట్ట విరుద్ధమన్నారు. ట్రాక్టర్ ను ప్రజా రవాణాగా వినియోగించటంపై నిషిద్ధం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు.
కేరళ వరదల హడావుడి కన్నా ఏదో ఉపద్రవం వచ్చినట్లుగా కొంగర కలాన్ సభ ఉన్నట్లుగా మండిపడ్డారు. ట్రాక్టర్లలో ప్రజల్ని తరలించాలన్న అంశంపై కేసీఆర్ మీద కేసు పెట్టాలన్నారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల.. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
నేతల తీరే కాదు సీనియర్ అధికారుల తీరును తప్పు పట్టారు రేవంత్. ఇటీవల హెచ్ ఎండీఏ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన జనార్దన్ రెడ్డి తీరుపై రేవంత్ విమర్శలు గుప్పించారు. ఔటర్ రింగ్ రోడ్డు మీద గంప గుత్తగా టోల్ ఎత్తి వేసే అధికారం ఎవరిచ్చారంటూ హెచ్ ఎండీఏ కమిషనర్ ను సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ పెట్టుకునే దిక్కుమాలిన సభకు నిబంధనలు ఉల్లంఘిస్తారా? అని ప్రశ్నించారు.
కోర్టులు ఎందుకు సుమోటోగా స్వీకరించి కేసులు నమోదు చేయటం లేదని ప్రశ్నించారు. హరితహారం అని నాటకాలు ఆడిన కేసీఆర్.. కొంగర బహిరంగ సభ కోసం వేలాది చెట్లను నరికి వేయించి కుప్పలా వేశారన్నారు. ప్రభుత్వ జీతభత్యాలతో పథకాల ప్రచారం కోసం నియమించుకున్న కళాకారులు పార్టీ సభలో పాడటం ఏమిటని నిలదీశారు. గ్రీన్ ట్రిబ్యునల్ వారు కేసీఆర్ పై కేసులు పెట్టి బొక్కలో పెట్టాలన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలనిరేవంత్ డిమాండ్ చేశారు.