తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఫ్యామిలీ త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటూ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. కేసీఆర్ ఫ్యామిలీది త్యాగమైతే.. తెలంగాణ కోసం తమ ప్రాణాల్ని అర్పించిన శ్రీకాంతాచారి.. యాదయ్య.. ఇషాన్ రెడ్డి లాంటి వాళ్లు ఎవరని ప్రశ్నించిన రేవంత్.. కేసీఆర్ సర్కారు పాలనలో తెలంగాణ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. యూనివర్సిటీలకు ఉప కులపతులు లేరని.. ఉద్యోగ నియామకాలు లేవని విరుచుకుపడ్డారు.
హైదరాబాద్.. సికింద్రాబాద్ లలోని కాలేజీలకు చెందిన విద్యార్థులు పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రేవంత్.. నాయకుల్ని తెలుగుదేశం పార్టీనే తయారు చేస్తుందని.. యువతను నేతలుగా మార్చే పార్టీ తమదని చెప్పుకున్నారు. సోషల్ మీడియాను అయుదంగా చేసుకొని కేసీఆర్ పాలనపై పోరు జరపాలని.. ఆయన ప్రభుత్వాన్ని సాగనంపాలంటూ పిలుపునిచ్చారు. సెక్రటేరియట్ కు రాని ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొదటి ర్యాంకు ఇచ్చిన కేంద్రం వైఖరి విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించలేని పార్టీలు కేసీఆర్ కు అనుబంధ విభాగాలు అవుతాయే కానీ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు అవుతాయంటూ ఎద్దేవా చేశారు.
అయినా.. తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ వస్తే సంతోషించకుండా.. దాని మీద విమర్శ చేయటం ద్వారా తెలంగాణవాదుల ఆగ్రహానికి రేవంత్ గురి అవుతున్న విషయాన్ని ఆయన గుర్తించరా? అన్నది ఒక ప్రశ్న. భావోద్వేగాలతో నిండిన తెలంగాణ సమాజంలో.. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని తప్పు పట్టటం అంటే.. నిప్పును ముట్టుకున్నట్లే. కేసీఆర్ తీరునుతప్పు పట్టటం.. ప్రభుత్వంలోని లోపాల్ని ఎత్తి చూపటం వరకూ బాగానే ఉన్నా.. ఏ రంగంలో.. ఎవరి వల్ల వచ్చినా మొదటి ర్యాంకు మొదటి ర్యాంకే. అలాంటి వాటి విషయంలో పొగడటం సాధ్యం కానప్పుడు కనీసం ఆ విషయాల్ని ప్రస్తావించకుండా మౌనంగా ఉండాలే కానీ.. విమర్శలు చేసి అడ్డంగా బుక్ అవ్వకూడదు. ఈ విషయంలోరేవంత్ కి ఎప్పటికి అర్థమయ్యేను?