ఫైర్ బ్రాండ్ సంచలనం: కేసీఆర్ నీ మెడ మీద ఏకే 47 పెడితే నీ ఫామ్ హౌజ్ రాసిస్తావా?
రాజకీయ నేత అయినంత మాత్రాన ఘాటుగా మాట్లాడటం సాధ్యం కాదు. అలాంటి టాలెంట్ చాలా తక్కువ మందికే ఉంటుంది. మాటలతో ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేయటం అందరికి సాధ్యమయ్యేది కాదు. అలాంటి టాలెంట్ చాలా తక్కువమందికే ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే.. ఇలాంటి తీరు టీపీసీసీ చీఫ్ కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సొంతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి.. మాటలతో మంట పుట్టించే గుణం ఆయన సొంతం. అంతేకాదు.. తన మాటలతో తన ప్రత్యర్థులకు కాలిపోయేలా చేసే ఆయన.. తాజాగా తన గురి సీఎం కేసీఆర్ మీద పెట్టారు.
ధాన్యంపై గడిచిన కొంతకాలంగా కేంద్రం వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా ఇష్యూ నడుస్తున్న వేళలో.. రేవంత్ అందులోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తమకు పారా బాయిల్డ్ రైస్ సరఫరా చేయమని లిఖిత పూర్వకంగా హామీ రాసి ఇచ్చారని చెప్పటం తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి కేసీఆర్ సర్కారు రాసిచ్చిన హామీ.. తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారిందన్నారు.
రైతుల హక్కులను కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ''కేసీఆర్ నీ మెడ మీద ఏకే 47 పెడితే నీ ఫామ్ హౌజ్ రాసిస్తావా? సీఎం కుర్చీ ఇస్తావా? సంతకాలు చేసిన మిమ్మల్ని ఉరి తీయాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని రైతులు రాళ్లతో కొట్టి చంపాలి'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలను ఏదోలా దోచుకునేలా కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. యూపీఏ హయాంలో గ్యాస్ రూ.414 ఉంటే లీటరు డీజిల్ రూ.55, పెట్రోల్ రూ.71 ఉండేదన్నారు. కేంద్రం పన్నుల రూపంలో రూ.10 లక్షల కోట్లు దోచుకుందని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ మీద పన్నుతో రూ.36 లక్షల కోట్లుప్రజల నుంచి వసూలు చేశాయని.. ఆ భారీ మొత్తాన్ని ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.
లీటరు పెట్రోల్ మీద కేంద్రం రూ.30.. తెలంగాణ ప్రభుత్వం రూ.35 పన్ను రూపంలో వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఓవైపు కేంద్రాన్ని.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. దీనికి కేసీఆర్ అండ్ కో ఎలా రియాక్టు అవుతారో చూడాలి.