కేటీఆర్ అణాపైసాకు పనికిరానోడా?

Update: 2016-01-26 04:24 GMT
మామూలుగానే ఫైర్ బ్రాండ్. ఇక.. ఎవరినైనా టార్గెట్ చేసి మరీ తిట్ల వర్షం కురిపించాలని డిసైడ్ అయితే.. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి హద్దేముంటుంది? అందులోకి ఆయన్ను కేసీఆర్ ను కానీ కేటీఆర్ ను కానీ తిట్టమని అడగాలే కానీ రెట్టింపు ఉత్సాహంతో చెలరేగిపోతారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో విమర్శల వర్షం ఊపందుకున్న వేళ..ఒకరిమీద ఒకరు తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి.

ఇలాంటి సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పై రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో అన్ని తానై పని చేస్తున్న కేటీఆర్ పై విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టిన రేవంత్.. మంత్రిగా ఫెయిల్ అయ్యాడని తేల్చేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్.. తన కుమరుడు కేటీఆర్ ను సీఎంను చేద్దామని అనుకుంటున్నాడని.. కానీ అణాపైసాకు పనికి రానోడు కేటీఆర్ అని విమర్శించారు. కేటీఆర్ నెత్తి మీద రూపాయి పెడితే ఏకాణికి పనికిరానోడని అలాంటోడిని తీసుకొచ్చి సీఎం చేయాలన్న ఆలోచన ఏందని ప్రశ్నించారు.

ఈ మధ్యన శిల్పారామం వెళ్లి మీటింగ్ పెట్టిన కేటీఆర్.. అక్కడకు వెళ్లి చంద్రబాబు ఏం చేశారంటూ అడిగారంటూ.. ‘‘ఈ మధ్య శిల్పారామం పోయిండు. అక్కడ మీటింగ్ పెట్టిండు. అక్కడ నిలుచొని చంద్రబాబు ఏం చేసిండని అడిగిండు. నేనంటున్న.. అరె.. అవే.. నువ్వు నిలుచొని మాట్లాడుతున్న శిల్పారామం కట్టించింది మేమే. శిల్పారామాన్ని నిర్మించింది చంద్రబాబే అని చెప్పటం జరిగింది’’ అంటూ విరుచుకుపడ్డారు. ఎన్ని కోపాలు ఉండొచ్చు.. మరెన్ని రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు. కానీ.. తిట్ల వర్షంతో విమర్శలు చేయటం అంత సబబుగా ఉండదు. ప్రస్తుతం ఉన్న దూకుడు రాజకీయాల్లో ఈ తరహా వ్యాఖ్యలు లేకుండా విమర్శల్ని వినలేమేమో..?
Tags:    

Similar News