రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీకి తిరోగమన దశ మొదలైందని టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. గతంలో పలు కారణాలతో ఆ పార్టీలోకి చేరిన వారెవరూ ఇప్పడు ఆ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బావ హరీశ్ రావును కలిస్తే బామ్మర్ది కేటీఆర్ కు కోపమొస్తుందని - వారిద్దరినీ కలిస్తే అమ్మగారు ఆగ్రహిస్తారని ఇక ఎవరిని కలవాలో తెలియని పరిస్థితుల్లో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయని ఆయన విమర్శించారు. టీఆర్ ఎస్ నేతలను కలుసుకోవాలంటే పోలీస్ స్టేషన్ వద్దకో - రెవెన్యూ ఆఫీసు వద్దకో వెళ్లాలని టీఆర్ ఎస్ పాలనలో పైరవీల రాజ్యం కొనసాగుతోందని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు శ్రీనివాస రెడ్డి టీఆర్ ఎస్ నుంచి తిరిగి టీడీపీలోకి చేరిన సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ ప్రసంగిస్తూ ఈ విమర్శలు చేశారు.
టీఆర్ ఎస్ లో కొత్తగా చేరిన ఏ నాయకుడికీ విలువ లేదని, గతంలో పలు కారణాలతో టీడీపీని వీడిపోయిన వారు మళ్లీ తెలుగుదేశంలోకి రావాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ మధ్యనే జూబ్లీహిల్స్ యువనేత ప్రదీప్ చౌదరి పార్టీలోకి తిరిగిరాగా, ప్రస్తుతం మేడ్చల్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి తిరిగి రావడం దీనికి తార్మాణమని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలు ఇదే స్పూర్తితో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయభేరి మోగిస్తుందని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. నీళ్లు ఎక్కువ ఉన్నా అందులో ఉండాల్సినదానికంటే ఎక్కువ చేపలు ఉంటే వాటికి సరిపడా ఆక్సిజన్ దొరక్క అవి మరణించే ప్రమాదముంటుందని, ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఆ పార్టీలో చేరిన వారికి తాము పనుల కోసం ఎవరిని కలవాలో అర్థం కావడం లేదన్నారు. బావను కలిస్తే బామ్మర్ధికి కోపం వస్తుందని, వారిద్దరినీ కలిస్తే అమ్మగారు ఆగ్రహిస్తారని, ఆమెను కలిస్తే పెద్దాయన కోప్పడతారని పరోక్షంగా కేటీఆర్ - హరీష్ రావు - కవితలపై వ్యంగోక్తులు విసిరారు. వారందరినీ ప్రసన్నం చేసుకోవాలంటే వారిముందు పొర్లు దండాలు పెట్టడం ఒక్కటే మార్గమని అయితే ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎవరూ ఆలాంటి స్థితికి దిగజారరని చెప్పారు.
హైదరాబాద్ నగరాభివృద్ధికోసం గతంలో చంద్రబాబు నాయుడు ఎంతగానో శ్రమించారని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుతం టీఆర్ ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జంటనగరాల వాసులు రోడ్లపై తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మున్సిపల్ శాఖా మంత్రిగా ఉన్న కేటీఆర్ రోడ్లపై తిరిగి ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి బదులుగా కేవలం టీవీలు - ఫొటోలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. విదేశాలలో తెల్లతోలు వారితో ఫొటోలు దిగి గొప్పమాటలు చెబుతున్నారని, నిజంగానే ఆయన గొప్పవారిని కలుస్తున్నారో లేదో ఎవరికీ తెలియదని, ఆయన చెబుతున్నట్లుగా హైదరాబాద్ కు పెట్టుబడులేవీ తరలిరావడం లేదని పేర్కొన్నారు. విశ్వనగరంలో కనీసం దోమల నివారణకు మందుకొట్టే పరిస్థితి కూడా లేదని వాపోయారు. ప్రస్తుతం తండ్రి ఫాంహౌస్ లో ఉంటే కొడుకు గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడని, అమ్మగారేమో పార్లమెంట్లో పెరుగన్నం తినిపడుకుంటున్నారని మొత్తం మీద రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని రేవంత్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్శిటీ చుటూ ముళ్లకంచె వేసిన విధంగా కేసీఆర్ తన ఫాంహౌస్ చుటూ ఇనుప కంచె వేసుకొని పోలీసు పహారా మధ్య పడుకుంటున్నారని, ఆయన ప్రజానాయకుడైతే ఇంతగా ప్రజలకు భయపడి దూరంగా ఉండాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోగా టీఆర్ ఎస్ కార్యకర్తలు - నేతల పేరుతో ఇంటికో పైరవీకారున్ని పుట్టించారని ఆరోపించారు. టీఆర్ ఎస్ నేతలను కలుసుకోవాలంటే పోలీస్ స్టేషన్ వద్దనో - తహశీల్లార్ కార్యాలయాలవద్దనో కాపుకాయాలని ఎందుకంటే రోజంతా అక్కడే వారు పైరవీలు చేస్తుంటారని ధ్వజమెత్తారు.