TSC : రేవంత్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ??

Update: 2022-12-26 23:30 GMT
టీఆర్ఎస్ లో రాజకీయ ప్రారంభించిన రేవంత్ రెడ్డి అక్కడ సీటు దక్కక టీడీపీలో చేరాడు. చంద్రబాబు ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. చంద్రబాబుకు రైట్ హ్యాండ్ గా అన్నీ చక్కబెట్టాడు.

అయితే  ఓటుకు నోటు ఎపిసోడ్‌తో రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం అనేక మలుపులు తిరుగుతోంది. ఆ ఎపిసోడ్ తెలంగాణ టీడీపీని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేలా చేసింది..

అయితే పీసీసీ అధ్యక్షుడిగా ప్రమోట్ అయిన రేవంత్ రెడ్డి పై సీనియర్లు తిరుగుబాటు చేయడంతో అక్కడ కూడా గడ్డు పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌, భాజపాలకు దీటుగా తెలంగాణలో కాంగ్రెస్‌ ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌తో విసిగిపోయి కొత్త రాజకీయ పార్టీని పెట్టాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఇప్పటికే ఆయన కొత్త రాజకీయ పార్టీని రిజిష్టర్ చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీ పేరు ‘తెలంగాణ సామాజిక కాంగ్రెస్ పార్టీ’. యూత్‌తో పాటు టీడీపీ, కాంగ్రెస్‌ సానుభూతిపరుల ఓట్లు కూడా తనకు పడతాయని ఆయన భావిస్తున్నారు. అయితే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపితే రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో కొత్త పార్టీ చాలా కష్టం కావచ్చు.

 పార్టీ పేరు, ఎజెండా, గుర్తును ఇంత తక్కువ సమయంలో ప్రజల్లోకి తీసుకెళ్లడం కష్టం. ప్రజలను ఆకట్టుకునేందుకే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని యోచిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే షర్మిల, బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు.వీళ్లది ముగిస్తే స్ట్రాట్ చేద్దామని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News