రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు మొత్తంగా మారిపోయిన సంగతి తెలిసిందే. విభజనకు కారణమైన కాంగ్రెస్ ను ఏపీలో పాతాళంలోకి తొక్కేసి.. మళ్లీ పైకి రాకుండా సీమాంధ్రులు తమ ఆగ్రహంతో కప్పేశారు. ఇక..తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ తో ఉద్యమ పార్టీ అయిన టీఆర్ ఎస్ అధికారాన్ని చేజిక్కించుకోవటం తెలిసిందే.
తమ చేతికి వచ్చిన అధికారాన్ని దీర్ఘకాలం కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్న టీఆర్ ఎస్ అందుకు తగినట్లుగా పావులు కదపటం.. తనకు ఎప్పటికైనా ప్రత్యర్థిగా మారే ప్రమాదం ఉన్న తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీగా ముద్రేయటం తెలిసిందే.
టీఆర్ ఎస్ వ్యూహాత్మక దాడిని తిప్పి కొట్టేందుకు టీటీడీపీ పగ్గాలు తెలంగాణ నేత అయిన రమణకు అప్పగించినా.. దాని వల్ల కలిగిన ప్రయోజనం పెద్దగా లేదనే చెప్పక తప్పదు. మరోవైపు.. టీటీడీపీ అసలుసిసలు తెలంగాణ పార్టీ అనే భావన కలిగించేందుకు ఏం చేయాలన్న అంశంపై తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. ఓటుకు నోటు కేసు ముందు వరకు రేవంత్ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చురుకైన నేతగా మాత్రమే గుర్తింపు ఉంది.
ఆ కేసు పుణ్యమా అని రేవంత్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖాముఖి రాజకీయ పోరుగా మారిపోయింది. కేసీఆర్ ను గద్దె దింపటమే లక్ష్యంగా.. తనను ఏ పోలీసుల చేత అయితే అరెస్ట్ చేయించారో.. అదే పోలీసుల చేత కేసీఆర్ ను అరెస్ట్ చేసే వరకూ వదిలిపెట్టనంటూ రేవంత్ భీకర శపధం చేయటం తెలిసిందే. ఈ కేసులో జైలుపాలై.. బెయిల్ మీద బయటకు వచ్చిన రేవంత్.. కోర్టు ఆదేశాలతో కొడంగల్ కే పరిమితమయ్యారు. తాజాగా హైకోర్టు బెయిల్ పరిమితులను సడలించటంతో ఆయన కొడంగల్ వీడి.. హైదరాబాద్ వస్తూ.. పార్టీ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
తరచూ తమ పార్టీ మీద విమర్శలు చేసేందుకు వీలుగా.. తమది ఆంద్రా పార్టీ అంటూ చేస్తున్న టీఆర్ ఎస్ నేతల వ్యాఖ్యలతో జరుగుతున్న డ్యామేజ్ ను కనీస స్థాయికి తగ్గించేందుకు ఏం చేయాలన్న అంశంపై రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి.. ‘‘తెలంగాణ అభివృద్ధి కోసం’’ అన్న ట్యాగ్ లైన్ ను జత చేరిస్తే.. తమ పార్టీకి తెలంగాణ లుక్ వచ్చుస్తుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి.. ట్యాగ్ లైన్ తోనే పార్టీ రంగు మారిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్న తమ్ముళ్లు ఉన్నారు. మరి.. వారి సందేహాలకు రేవంత్ ఏం సమాధానం చెబుతారో..?