రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. చంద్రబాబునాయుడు రెండు నిమిషాల సమయం ఇచ్చి.. కాసేపు తరవాత మాట్లాడదాం అని చెప్పినప్పటికీ.. ఇక మాట్లాడేదేమీ లేదన్నట్లుగా ముందుగానే సిద్ధపడి బెజవాడకు వెళ్లిన రేవంత్ - చంద్రబాబు పక్కకు వెళ్లిన వెంటనే.. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దన్ కు రాజీనామా లేఖ ఇచ్చేసి వచ్చేశారు. ఆయన తన రాజీనామా లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. అక్కడితో తన రాజకీయ జీవితంలో పచ్చ అధ్యయానికి భరతవాక్యం పలికారు. ఒక పర్వం ముగిసిపోయింది.
అయితే రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన లేఖలోనే ఆయన తెలివితేటలు మొత్తం బయటపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాధారణంగా ఒక రాజకీయ పార్టీని విడిచిపోతున్న నాయకులందరూ వదిలేస్తున్న పార్టీ మీద బురద చల్లడానికి, అక్కడి నాయకులు కొందరి మీద విమర్శలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అన్నాళ్లూ ఉన్న పార్టీ మీదే నిందలు వేసి వెళతారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి వారందరికీ భిన్నంగా వ్యవహరించారు. మూడు పేజీల లేఖ ఆద్యంతమూ చంద్రబాబునాయుడు ను పొగుడుతూనే సాగింది. అలాగే చంద్రబాబునాయుడుకు చాలా రకాలుగా కృతజ్ఞతలు చెప్పారు. ఆయనతో కలిసి పనిచేసినందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. తన మీద ఎన్టీఆర్ ప్రభావమూ ఉందన్నారు. అయితే కేసీఆర్ దుష్ట పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం తన ప్రథమ లక్ష్యంగా మారిందని అందులో పేర్కొన్నారు. సీనియర్లనందరినీ పక్కన పెట్టి.. తనకు ప్రాధాన్యం కట్టబెట్టినందుకు కూడా రేవంత్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.
అంతే తప్ప.. తనకు తెలుగుదేశమే రాజకీయ జీవితం ప్రసాదించినట్లుగా ఎక్కడా చెప్పలేదు. పైగా తన రాజకీయ జీవితం గానీ, హోదాలు గానీ.. తాను స్వతంత్రంగా సంపాదించుకున్నవే అనే సంకేతాలు ఆయన లేఖ ప్రారంభంలోనే ఇచ్చారు. తాను 2006లోనే ఇండిపెండెంట్ జడ్పీటీసీ అయ్యానని, 2007లో స్వతంత్రం ఎమ్మెల్సీ అయ్యానని చెప్పడం ద్వారా తన రాజకీయ పునాదులు తన సొంత కష్టం ఫలితమేనని , తెదేపా భిక్ష కాదని ఆయన సంకేతాలు ఇచ్చినట్లయింది. మొత్తానికి కేసీఆర్ మీద పోరాటం ఒక్కటే తాజా ఎజెండా అన్నట్లుగా, అందుకు పార్టీలో వాతావరణం సహకరించినందున రాజీనామా చేస్తున్నట్లుగా తన నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాల్సిందిగా ఆయన కోరడం విశేషం. లేఖలోనే రేవంత్ రెడ్డి... తన చాతుర్యం లౌక్యం మొత్తం ప్రదర్శించారని పలువురు అంటున్నారు.