ఆ రైతులవి సహజ మరణాలు కాదన్న రేవంత్ రెడ్డి

Update: 2021-11-21 09:40 GMT
రైతుల హక్కులను అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టడానికి మోడీ చేసిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా రైతులు పోరాటం చేశారు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉద్యమంలో 700మందికి పైగా రైతులు అమరవీరులయ్యారని తెలిపారు.

మరణించిన రైతులకు నివాళులు, విజయం సాధించిన రైతులకు అభినందనలు తెలుపడానికి కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టిందన్నారు. రైతులు సహజ మరణం కాలేదని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇవన్నీ మోడీ చేసిన హత్యలని అన్నారు.

మోడీ ఎన్ని రకాలుగా హింసలు పెట్టిన ఉద్యమంలో రైతులు వెనక్కి తగ్గలేదని.. ఈ దేశానికి రాష్ట్రానికి పట్టిన పీడ మోడీ, కేసీఆర్ లు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతుల పోరాట ఫలితంగా మోడీ చట్టాలను వెనక్కి తీసుకుంటే అవి మా గొప్ప అని కేసీఆర్ కు గులాబీ చీడ పురుగులు పాలాభిషేకం చేస్తున్నారన్నారు.

మోడీ చట్టాలు తెచ్చినప్పుడు అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమంటే చేయలేదని.. ఏ ఒక్కరోజు రైతు ఉద్యమానికి మద్దతు పలుకలేదన్నారు. ఒక్క రైతును పరామర్శించలేదన్నారు.ఇప్పుడు కేసీఆర్ ఒక్క పూట ధర్నా చేస్తేనే భయపడి మోడీ నల్లచట్టాలను వెనక్కి తీసుకుంటే మరి రైతులు పండించిన పంటలకు ఎందుకు కొనేలా చేడయం లేదన్నారు. ఎప్పుడు కేసీఆర్ నరేంద్రమోడీ వ్యతిరేకంగా పనిచేయలేదని.. ఇద్దరూ తోడు దొంగలన్నారు.

మోడీకి మొదటి నుంచి కేసీఆర్ మద్దతు ఇస్తున్నాడని.. నోట్ల రద్దు కాడి నుంచి త్రిబుల్ తలాక్ వరకూ అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. కల్లాలలో లక్షల టన్నుల ధాన్యం ఉంది.. కేసీఆర్ వెంటనే రైతులను ధాన్యం అంత కొనాలి.. మోదీని నమ్మొద్దు.. మోడీ వెంటనే నల్ల చట్టాలను రద్దు చేసేలా పోరాటాలు చేయాలి.. పోరాటంలో మరణించిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఆదుకోవాలి..

కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుందని.. వరి రైతులకు అండగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అంటున్నారని.. కేసీఆర్ మోసాలను రైతులు అర్థం చేసుకోవలన్నారు. వరి రైతులకు న్యాయం చేయకపోతే కేసీఆర్ కు ఉరివేయాలని.. రాష్ట్రంలో ప్రతి గింజకొనే వరకూ పోరాటం చేస్తామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.
Tags:    

Similar News