భార్య ఉండ‌గా...గుజ‌రాతీ స్త్రీని భార్య‌గా పేర్కొన్న హ‌రీశ్‌ రావు!!

Update: 2018-09-12 12:58 GMT
ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో తెలంగాణ రాజ‌కీయాలు ఊహించ‌ని హీటెక్కుతున్నాయి. అధికార ప్ర‌తిప‌క్షాలు - ఒక‌రిని మించి మ‌రొక‌రు వేస్తున్న ఎత్తుల‌తో తెలంగాణ రాజ‌కీయాలు రోజుకో హాట్ హాట్ ఆప్‌ డేట్‌ ను తెర‌మీద‌కు తెస్తున్నాయి. న‌కిలీ పాస్‌ పోర్ట్ కేసులో కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి అరెస్ట్ అనంతరం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాల కేసులో  మాజీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. కాగా, త‌న‌పై న‌మోదైన కేసుపై రేవంత్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. త‌నపై రాజకీయ కక్షతోనే జూబ్లీహిల్స్ హౌజింగ్ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ రాజకీయ వేట నాతోనే మొదలు పెట్టారు. నన్ను అరెస్ట్ చేయమనుండి .. కేసులు పెట్టుకోమనండి ..నేను చూస్తా ...ఏం జరుగుతుందో కేసీఆర్‌ కు తెలుస్తుంది` అని వ్యాఖ్యానించారు.

పార్టీ కార్యాల‌యంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ ఎస్ అధినేత‌ - ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై విరుచుకుప‌డ్డారు. కేసీఆర్ కుటుంబ స‌భ్యులే న‌కిలీ పాస్‌ పోర్ట్ - వీసాల దందాలో చిక్కుకున్నార‌ని ఆరోపించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే హరీష్ రావు గుజరాత్ మహిళను తన భార్యగా అమెరికాకు పంపించారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ కేసులో ప్ర‌స్తుత‌ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా ఉన్నారని రేవంత్ ఆరోపించారు. `` మహేందర్ రెడ్డికి డీజీపీ పోస్ట్ ఇచ్చినందుకు ...ఈ కేసులో నుండి కేసీఆర్ - హరీష్ రావు పేర్లను తప్పించారు మనుషుల అక్రమ రవాణా కేసులో కేసీఆర్ - హరీష్ రావుల పై విచారణ జరగాలి. కేసీఆర్ - హరీష్ రావులే ఈ కేసులో ఉన్నారే త‌ప్ప జగ్గారెడ్డికి అసలు సంబంధమే లేదు. కేసీఆర్ సీఎం అయ్యాక ఛార్జ్‌ షీట్లో కేసీఆర్ - హరీష్ పేర్లను తప్పించారు. కేసీఆర్‌ కు లొంగనందుకే జగ్గారెడ్డిపై కేసులు బనాయించారు.`` అంటూ మండిప‌డ్డారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పోలీసులతో కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. మమ్మల్ని కేసులతో వేధించేందుకు కేసీఆర్ తన సామాజిక వర్గానికి చెందిన పొలిసు అధికారులను నియమించారు. మమ్మల్ని వేధిస్తున్న అధికారుల పేర్లను కాంగ్రెస్ డైరీలో రాసుకుంటున్నాం. మేం అధికారంలోకి వచ్చాక ఆ అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం. లెక్కపెట్టి మరీ రివెంజ్ తీసుకుంటాం. పోలీసులారా ..కేసీఆర్ ప్రయివేట్ సైన్యం గా మారకండి అని సూచించారు.

కాంగ్రెస్ నేతలను భయపెట్టి కేసీఆర్ గెలవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ``తుపాకీనే లేని గండ్ర వెంకటరమణారెడ్డిపై తుపాకీతో బెదిరించారని కేసు పెట్టారు. అధికారంలోకి రావడానికి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను చంపేయడానికి కూడా వెనకాడరు. దొంగ పాస్‌ పోర్టుల కేసుపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణకు గవర్నర్ ఆదేశించాలి. `శాంతి భద్రతలు గవర్నర్ పరిధిలో ఉన్నా గవర్నర్ ఎందుకు జోక్యం చేసుకోవడంలేదు? గవర్నర్ స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం ..లేకపోతే కోర్టుకు వెళతాం. కేసీఆర్ ...మమ్మల్ని కేసులకు - జైళ్లకు పంపినంత మాత్రాన భయపడం. మేం అధికారంలోకి వస్తాం..కేసీఆర్‌ కు వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాం`` అని రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు.
Tags:    

Similar News