కాంగ్రెస్‌కు భారీ ఝ‌ల‌క్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

Update: 2016-06-15 13:39 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్య‌నిర్వాహక అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కొత్త స్టేట్‌ మెంట్ ఇచ్చారు. ఎంపీలు - ఎమ్మెల్యేల‌ వ‌రుస జంపింగ్‌ ల‌తో కాంగ్రెస్ పార్టీ కుదేలు అవుతుంటే రేవంత్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు! కాంగ్రెస్‌ కు తగిన శాస్తి జరిగిందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొంటున్నప్పుడు కాంగ్రెస్ కనీసం స్పందించలేదని పేర్కొంటూ ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలను కొంటుంటే  పెడబొబ్బ‌లు పెడుతున్నారని సెటైర్ వేశారు. చిన్న కారణానికి 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి గెంటివేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళను తాము కలిసి ప్రభుత్వ తీరుని ఖండించమంటే పట్టించుకోలేదని గ‌తం గుర్తుచేశారు.

'టీడీపీ ఖతం చేస్తా..ఇక ఉంటె మీరు లేకుంటే మేము' అని కేసీఆర్ చెప్పిన మాటలు వింటూ ఇన్ని రోజులు కాంగ్రెస్ నిద్రపోయిందని దాని ఫ‌లితం ఆ పార్టీ ఇపుడు అనుభ‌విస్తున్న‌ద‌ని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. జంపింగ్‌ ల‌తో కేసీఆర్ చేస్తున్న వికృత క్రీడను చూస్తూ ఇప్పుడు బీజేపీ కూడా తమకు ఏమి పట్టనట్లు ఉంద‌ని అయితే తొందర్లోనే బీజేపీకి ఇదే పరిస్థితి వస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ అయ్యాక కాంగ్రెస్ ఇక తరువాత బీజేపీపైనే కేసీఆర్ న‌జ‌ర్ ఉంద‌ని రేవంత్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News