రేవంత్ చెప్పిన పులి-గాడిద క‌థ విన్నారా?

Update: 2017-01-19 11:35 GMT
మాట‌ల మంత్రికుడు అనే పేరు పొందిన తెలంగాణ టీడీపీ ప్లోర్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగిన తీరును పిట్ట‌కథ రూపంలో చెప్పారు. శాసనసభ శీతకాల సమావేశాలలో సభ మొత్తం ఏకపక్షంగా జరిగిందనడానికి ఉదాహరణగా రేవంత్ రెడ్డి చెప్పిన కథ ఇది. "ఒక అడవిలో ఒక పులి - ఒక గాడిద హోరాహోరిగా పోరాడుతున్నాయి, వాటి అరుపులు కేకలతో అడవి మొత్తం దద్దరిల్లిపోతోంది. రాత్రి వెళ కూడ వాటి పోరాటం ఆగలేదు. ఇది అడవిలోని ఇతర జంతువులకు ఇబ్బందిగా తయారుకావడంతో ఒక ఏనుగు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. ఇంతకు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారని పులి - గాడిదలను ఆ ఏనుగు అడిగింది. 'భూమికి దూరంగా కనిపించే భూమి ఆకాశాలు రెండు నిజంగా కలిసే ఉన్నాయని నేను చెప్తున్నాను కానీ అవి కల్పినట్లు కనిపిస్తాయే తప్ప నిజంగా కలవవని ఈ పులి చెప్తోంది' అని గాడిద బదులిచ్చింది" అంటూ రేవంత్ తదనంతర కథ వివరించారు.

"ఇలా కాదని  ఏనుగు ఏ వివాదం అయినా మన అడవి రాజ సింహం దగ్గరే తేల్చుకోవాలని పులి - గాడిదలను సింహం వద్దకు తీసుకువెళ్లింది. వాటిని విచారించిన సింహం పులిని కట్టెసి వంద కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశించింది. దీంతో బిత్తరపోయిన పులి 'మహారాజా నేను చెప్తున్నది నిజమే అని మీకు తెలుసుకదా? మరి నన్నెందుకు కొట్టమన్నారు?' అని సింహాన్ని అడిగింది. 'అది గాడిద - దానికి నువ్వేం చెప్పినా అర్థం కాదు - అది అనుకున్నదే చెప్తుంది ఆ విషయం తెలిసికూడా  నువ్వు గాడదతో గొడవ పడ్డావు. అందుకే నీకు ఈ కొరడా దెబ్బలు' అని సింహం స్పష్టం చేసింది. ఈ కథలో నీతిలాగానే సభలో మీరు ఏం చెప్పినా ఎవరు వినరని ఓ పెద్దమనిషి నాకు చెప్పారు!" అంటూ ముక్తాయించారు రేవంత్. ఈ కథ ద్వారా అధికార పక్షాన్ని ఏం తిట్టాలో అది పరోక్షంగా తిట్టారని టీడీపీ నాయ‌కులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News