తెలంగాణ ఎన్నికల బరిలో రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఓడిపోయారు. అతడు ఓడిపోతాడని ఎవరూ ఊహించలేదు. కనీసం ఒక్క సర్వే కూడా చెప్పలేదు. అలా అనూహ్యంగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి మీడియా ముందుకు రావడం మానేశారు. పూర్తిగా తన కుటుంబ వ్యవహారాలు - వ్యాపారాలకే పరిమితమైపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది. తన బలాన్ని నిరూపించుకునే టైమ్ వచ్చింది.
తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి చెందిన కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులే అధికారంలోకి వచ్చారు. ఇది రేవంత్ కు కలిసొచ్చే అంశం. కొడంగల్ నియోజకవర్గంలో ఏకంగా 67 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరచగా - కేవలం 17 పంచాయతీల్లో మాత్రమే నెగ్గుకురాగలిగింది. దీంతో రేవంత్ రెడ్డి మరోసారి తెరపైకి రావడానికి అవకాశం ఏర్పడింది.
ఈ తాజా పంచాయతీ ఎన్నికలు రేవంత్ రెడ్డి ఓటమిపై మరిన్ని అనుమానాలు పెంచేలా చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవడానికి ఆస్కారం లేని రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఈవీఎంలను టాంపరింగ్ చేయడమే అనే వాదనలకు ఇది మరింత బలం చేకూరుస్తోంది. ఎఁదుకంటే 67 పంచాయతీల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఓడిపోవడం విచిత్రమే కదా.