నోటికి వచ్చినట్లుగా మాటలు చెప్పటం రాజకీయ నాయకులకు కొత్తేం కాదు. అయితే.. అలాంటి మాటల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ బాగానే గుర్తించినట్లు కనిపిస్తోంది. మిగిలిన అధినేతలకు భిన్నంగా ఆయన.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే అంశానికి సంబంధించి చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా.. అందులో తాము 72స్థానాల్లో గెలిచే వీలుందని.. ఇప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించినా గెలుస్తామని చెప్పటం తెలిసిందే.
గ్రేటర్ ఎన్నికల వేళ.. తమకు ప్రతికూల వాతావరణం ఉందని తెలిసినా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమే కాదు మంత్రి కేటీఆర్ సైతం 110 సీట్లకు ఒకట్రెండు తేడాతో సొంతం చేసుకుంటామని చెప్పారు. కానీ.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం.. చావు తప్పి లొట్టబోయిన పరిస్థితి గురించి తెలిసిందే. అందుకేనేమో.. 90.. 100సీట్లు వస్తాయన్న మాట చెప్పని రేవంత్.. వాస్తవానికి దగ్గరగా ఉండేలా లెక్క చెప్పారంటున్నారు. ఈ లెక్క కూడా ఏదో నోటికి వచ్చిన మాటగా చెప్పకుండా.. శాస్త్రీయంగా లెక్కలు కట్టటమే కాదు.. భారీ హోం వర్కు చేసిన తర్వాతే ఈ ఫిగర్ చెప్పినట్లుగా చెబుతుున్నారు.
అధికారంలోకి రావాలంటే 60సీట్లుసరిపోతాయి. కానీ.. రేవంత్ 72 సీట్లు వస్తాయని చెప్పటం ద్వారా.. తమకు తిరుగులేని అధికారం తమ సొంతమవుతుందన్న భావనను వ్యక్తం చేశారని చెప్పాలి. మొత్తం 119 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉందన్న స్థానాల్ని ఏ కేటగిరిలో.. ఒక మోస్తరు అవకాశం ఉన్న వాటిని బి కేటగిరిలో.. గెలిచే వీల్లేని నియోజకవర్గాల్ని సీ కేటగిరిలో ఉంచిన రేవంత్.. గెలిచే అవకాశాలున్న వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని భావిస్తున్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం వరించే అవకాశం ఉన్న నియోజకవర్గాల్ని ఎంపిక చేసుకొని.. అక్కడి స్థానిక అవసరాలకు ప్రాధాన్యతల్ని తెలుసుకొని.. అందుకుతగ్గట్లు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. దక్షిణ.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ పరిస్థితి మీద ఇప్పటికే అంచనాకు వచ్చిన ఆయన.. గ్రేటర్ హైదరాబాద్ లోని అసెంబ్లీ నియోజకవరగాల్ని మాత్రం ప్రత్యేక కేటగిరి కిందకు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఎన్నికలకు ఏడాదిన్నర ముందే గెలుపు గుర్రాల్ని డిసైడ్ చేసి.. వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తమకున్న బలాన్ని మదింపు చేసుకున్న రేవంత్.. దక్షిణ తెలంగాణలో పార్టీకి విజయవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తోంది. ముఖ్యంగా.. నల్గొండ.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్.. మెదక్.. ఖమ్మం స్థానాల్లో మెజార్టీ స్థానాల్ని సొంతం చేసుకోవాలన్న ప్లానింగ్ తో ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ ఐదు జిల్లాల్లో మొత్తం 50 స్థానాలు ఉంటే.. అందులో 40 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తే.'72 సీట్ల' లక్ష్యాన్ని చేరుకోవటం కష్టం కాదన్న మాట వినిపిస్తోంది. హైదరాబాద్ జిల్లాకు వస్తే.. నాంపల్లి.. గోషామహల్.. సికింద్రాబాద్.. సనత్ నగర్.. కంటోన్మెంట్ స్థానాలపై ఆయన కసరత్తు షురూ చేసినట్లు చెబుతున్నారు.
దక్షిణ తెలంగాణతో పోలిస్తే.. ఉత్తర తెలంగాణలో అధికార టీఆర్ఎస్ బలంగా ఉందన్న విషయంపై క్లారిటీ ఉన్న రేవంత్.. అందుకు తగ్గట్లే అక్కడి ప్లాన్ ను చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. గడిచిన మూడు.. నాలుగుసార్లు వరుస విజయం సాధించిన నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని.. అక్కడి ప్రజల్లో స్థానిక నాయకత్వం మీద వ్యతిరేకత ఉంటుందని.. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న వ్యూహంతో ఉన్నట్లు చెబుతున్నారు. పేపర్ మీద ఫైర్ బ్రాండ్ ప్లానింగ్ బాగున్నట్లే కనిపిస్తోంది. మరి.. ప్రాక్టికల్ గా ఎలాంటి ఫలితం వస్తుందన్న తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.