రేవంత్ కు రిపోర్ట్ అలా వచ్చిందా?

Update: 2015-12-27 05:14 GMT
మరికొద్ది గంటల్లో మరోసారి.. చంద్రుళ్లు ఇద్దరూ కలవనున్నారు. అయుత చండీయగానికి రావాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వయంగా వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించటం.. అందుకు ఆయన సానుకూలంగా ఓకే చెప్పేయటం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం చంద్రబాబు.. యాగానికి హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మాత్రం అధినేత యాగానికి వెళ్లటంపై పెదవి విరుస్తున్నట్లు చెబుతున్నారు. ఓపక్క తాము తెలంగాణ అధికారపక్షం వైఖరి మీద పోరాడుతుంటే.. మరోవైపు తమ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి వ్యక్తిగత హోదాలో నిర్వహిస్తున్న యాగానికి వెళ్లటం ఏమిటన్న వాదనను వినిపిస్తున్నట్లు చెబుతున్నారు.

చంద్రబాబు యాగానికి వెళ్లే విషయం మీద తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రైవేటుగా ఒక సర్వే చేయించుకున్నారట. యాగానికి బాబు వెళ్లటం ద్వారా ఎలాంటి ప్రభావం ఉంటుందన్న విషయం మీద ఆయన చేయించిన సర్వే.. ప్రతికూల ఫలితాల్ని ఇచ్చిందట.కేసీఆర్ యాగానికి బాబు హాజరు కావటాన్ని పార్టీ నేతలు మొదలుకొని..హైదరాబాద్ లో సెటిల్ అయిన సీమాంధ్ర ప్రజలకు కూడా నచ్చటం లేదట.

తాము మాత్రం తెలంగాణ అధికారపక్షానికి అనుకూలంగా ఓటు వేయాలి కానీ.. పార్టీ అధినేత మాత్రం అందుకు భిన్నంగా ఆయన నిర్వహించే కార్యక్రమానికి వెళ్లటం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఇక లేదని.. తాము మాత్రమే తెలంగాణ అధికారపక్షానికి దూరంగా ఎందుకు ఉండాలని.. కారును అభిమానించి.. ఆరాధించటం ద్వారా సౌకర్యాలతోపాటు.. మరిన్ని వసతులు పొందే అవకాశం ఉండటంతో పాటు.. సీమాంధ్రులు సైతం తమ వెంటే ఉన్నారన్న భావన తెలంగాణ అధికారపక్షానికి ఉంటే.. వారు తమ గురించి మరింత సానుకూలంగా ఆలోచిస్తారన్న భావనను వ్యక్తం చేస్తున్నట్లుగా సదరు సర్వే చెప్పిందట. మరి.. ఈ మాటలు ఎంతవరకు నిజమన్నది రేవంత్ అండ్ కో సమాధానమిస్తేనే సమంజసంగా ఉంది.
Tags:    

Similar News