తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒంటికాలితో లేచే టీడీపీ మాజీ నేత - ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి మరో ఎజెండాతో తెలంగాణ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ ప్రతిపాదిస్తున్నరేవంత్ ఈ క్రమంలో భారీ సభ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆత్మగౌరవంతో బతికే అవకాశం లేకపోగా అణచివేసి ప్యూడల్ విధానంలో రాష్ట్ర పరిపాలన కొనసాగుతోందని పేర్కొంటూ దీనిని అంతమొందించే రాజకీయ పునరేకీకరణ పోరాటం మరింతగా ప్రజ్వరిల్లాలనే భావనతో తాము ఈ సభకు శ్రీకారం చుట్టినట్లు రేవంత్ ప్రకటించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా నూతన తెలంగాణా రాష్ట్రంలో కూడా అత్యధికంగా నష్టపోతున్నది పాలమూరు - రంగారెడ్డి జిల్లాలే అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని ఒక ప్రకటనలో రేవంత్ మండిపడ్డారు. ఉద్యమం సమయంలో టీఆర్ ఎస్ నేతలు పాలమూరు - రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి విషయంలో ఎన్నో హామీలిచ్చారని గుర్తు చేశారు. ఇప్పటిదాకా ఎలాంటి నీటి వనరులు లేక బీడు వారిన కల్వకుర్తి - జడ్చర్ల - మహబూబ్ నగర్ - కొడంగల్ - దేవరకద్ర - నారాయణ పేట - తాండూరు - చేవెళ్లలాంటి అన్ని ప్రాంతాలకు నీళ్లు గలగలమంటూ చేరుకుంటాయని ఎన్నో కథలు చెప్పారన్నారు. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని దాని కోసం ఆర్టీఎస్ గట్టుపై కుర్చీ వేసుకూర్చుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ తాను అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మరిచిపోయారని మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో వలసలు ఆగలేదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ వైఫల్యాలు ఇంకెన్నో ఉన్నాయని, ఈ నేపథ్యంలో రాజకీయ పునరేకీకరణ చారిత్రాత్మక అవసరమైన ఈ తరుణంలో ప్రస్తుతం మొదలైందన్నారు.
2019లో జరిగే తెలంగాణ తుది దశ ఉద్యమంతో దొరల గడీల పునాదులను పెకిలించాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణాను ఇచ్చిన సోనియాగాంధీ - ఇప్పించిన రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ ఆశయ సాధనలో భాగంగా జడ్చర్ల జనగర్జనసభకు పెద్ద ఎత్తున తరలి రావాలని, ప్రజాకంటక పాలనలను అంతమొందించడానికి కొనసాగే ఈ సమరానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని, ప్రజాబలం ఏమిటో సర్కారుకు చాటి చెప్పాలని ఆయన కోరారు.
ఇదిలాఉండగా...మరో ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సైతం ఈ సభ విజయవంతం కావాలని కోరారు. టీఆర్ ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరముందని, అందులో భాగంగా 20న జడ్చర్ల జన గర్జన పేరుతో భారీ బహిరంగ సభ టీఆర్ ఎస్ వ్యతిరేక శక్తుల ఐక్యతకు నాంది పలుకుతుందన్నారు. జడ్చర్ల జనగర్జన సభను విజయవంతం చేసేందుకు టీఆర్ ఎస్ వ్యతిరేక శక్తులు ప్రజలు - కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు - విద్యార్థులు - నిరుద్యోగులు - వృత్తిదారులు కష్ట నష్టాల పాలవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలిచ్చి మభ్య పెడుతూ రాజకీయ భ్రమలు కల్పించి కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నిరుద్యోగులు ప్రాణాలు వదులుతున్నా, అవినీతి పెరిగిపోయినా కూడా కేసీఆర్ ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకపోగా వాటికి వంత పాడే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
కులాల మధ్య చిచ్చు పెడుతూ వారిని కుల వృత్తులకు పరిమితం చేసి పాలనాధికారాలను తన చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నారని జైపాల్ రెడ్డి ఆరోపించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అవినీతి రాజ్యమేలుతుందని ముఖ్యమంత్రే స్వయంగా రాజకీయ ఫిరాయింపులను విచ్చలవిడిగా ప్రోత్సహించి ఒక అనైతిక పాలన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అప్పులు చేయడం తప్ప అభివద్ధి లేకుండా పోయిందన్నారు. ఉద్యమాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ నిరంకుశ - అవినీతి - అశ్రిత పక్షపాతం నుంచి కూడా కాపాడుకోవడానికి మరోసారి కేసీఆర్ వ్యతిరేక శక్తులంతా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవశ్యకత ఏర్పడిందన్నారు.