ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ఫిరాయింపుల మీద ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే బాధితులుగా కాంగ్రెస్ మారిపోయింది.ఇప్పటికీ కాంగ్రెస్ ను ఖాళీ చేసి చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్, బీజేపీలో చేరిపోయారు. కొందరు అనైతికంగా వెళితే.. ఇంకొందరు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ప్రతిపక్షంలో ఉండడంతో కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది. అయితే ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గట్టి షాకిచ్చారు.
పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇద్దరు అభిచ్యువల్ అఫెండర్ లు ఉన్నారని.. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్.. టీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వెళ్లాలని చూసిన వాళ్లపై పోరాడుతామన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇంప్లీడ్ అయ్యి ఆ 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయించాలనే దానిపై చర్చ చేస్తున్నామని బాంబు పేల్చారు.
కాంగ్రెస్ లో గెలిచి.. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు పోయేలా పిటీషన్ వేస్తామని.. సీబీఐ విచారణ కోరుతామని తెలిపారు. దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నుంచి గెలిచి లంచాలు తీసుకొని పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై విచారణ చేయాలని కోరుతామన్నారు. 2018 నుంచి పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
పదవుల కోసం కొందరు.. ఆర్థిక లబ్ది కోసం మరికొందరు ఇలా పార్టీ మారారని వారిపై విచారణ జరగాలన్నారు. దీనిపై కేంద్రహోంశాఖ, సీబీఐకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. వివరాలు సీబీఐకి అందిస్తామన్నారు. కేంద్రం కూడా ఫిరాయింపులపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి కోరారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విచారణ ఒకరు దోషిగా.. ఒకరు బాధితుడిగా జరుగుతోందని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ వాదన నేరం జరిగింది విచారణ మేమేం చేస్తాం అంటున్నారని.. బీజేపీ నేరమే జరగలేదంటోందని.. సీబీఐ విచారణ ఎందుకు అడుగుతున్నారని రేవంత్ పేర్కొన్నారు.
సీబీఐ బీజేపీ చెప్పినట్టు వింటుందని.. బీఆర్ఎస్ చెప్పినట్టు సిట్ వింటుందని.. ప్రజలనే వెర్రివాళ్లను ఈ రెండు పార్టీలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.