విషయం ఏదైనా విరుచుకుపడటంలో తాజా మాజీ మంత్రి కేటీఆర్ కు సరిపోలే వారెవరూ లేరనే చెప్పాలి. అలాంటి ఆయన నోట మాట రాని రీతిలో తాజాగా తెలంగాణ తెలుగుదేశం నేత చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ ఆత్మరక్షణలో పడేలా రేవూరి మాటలు ఉన్నాయి.
లోపల ఎలా ఉన్నా బయటకు మాత్రం హరీశ్ తో అద్భుతమైన కెమిస్ట్రీ ఉందన్నట్లుగా బిల్డప్ ఇచ్చే కేటీఆర్ కు నోట మాట రాని రీతిలో టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతో చిన్నా పెద్దా తేడా లేకుండా కేటీఆర్ అహంభావంతో మాట్లాడటాన్ని తప్పు పట్టారు.
వరంగల్‌లో తాజాగా మాట్లాడిన ఆయన కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ బావంటే మీకు ఇష్టం ఉన్నప్పుడు మొదట్నించి కేసీఆర్ కు అండగా ఉన్న హరీశ్ ను ముఖ్యమంత్రి రాజకీయ వారసుడిగా ప్రకటిస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఏ ప్రశ్న అయితే సూటిగా అడగలేరో.. అదే ప్రశ్నను ముఖం మీద కొట్టినట్లుగా రేవూరి నోటి నుంచి వచ్చిందని చెప్పాలి.
హరీశ్ ను కేసీఆర్ రాజకీయ వారసుడిగా ప్రకటించే దమ్ముందా? అంటూ ప్రశ్నించిన రేవూరి.. నీతి.. నిజాయితీని నిరూపించుకోవాలంటే ముందు ఆ ప్రకటన చేయాలన్నారు. హరీశ్‌ను ఉద్దేశించి కేటీఆర్ కాని ఆ తరహాలో ప్రకటన చేసినట్లైయితే.. గతంలో తాను చేసిన వ్యాఖ్యలన్నింటిని వెనక్కి తీసుకుంటానని చెప్పారు. తమ రాజకీయ ప్రత్యర్థులు చేసే సవాళ్లకు ఇట్టే స్పందించే కేటీఆర్.. తాజాగా రేవూరి నోటి నుంచి వచ్చిన సవాల్ కు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అత్యాశ కాకుంటే.. ఇలా ఇరుకున పడేసే సవాళ్లకు కేటీఆర్ స్పందిస్తారా ఏంటి?