తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్)లో ముసలం రేగుతోందని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించాలని హరీష్ రావు తనకు స్వయంగా ఫోన్ చేశారని, అందుకోసం అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని చెప్పారని వంటేరు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించకుంటే వంటేరుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హరీష్ అన్నారు. తాను జీవితాంతం టీఆర్ ఎస్ లోనే ఉంటానని - తుది శ్వాస వరకు కేసీఆర్ వెంటే నడుస్తానని చెప్పారు. తనపై చేసిన వ్యాఖ్యలను నిరూపించకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి హరీష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ ఎస్ తో సమానంగా ప్రజాకూటమికి సీట్లు వస్తే హరీష్ రావు సీఎం అని ...రేవూరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజా కూటమికి టీఆర్ ఎస్ తో సమానంగా సీట్లు వస్తే..టీఆర్ఎస్ నుంచి కొందరిని తీసుకొని వచ్చి హరీష్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. టీఆర్ ఎస్ లో అంతర్యుద్ధం జరుగుతోందని రేవూరి అన్నారు. టీఆర్ఎస్ లో హరీష్ రావు అసలు సిసలైన నాయకుడని ప్రశంసించారు. టీఆర్ ఎస్ లో హరీష్ ఇమడలేకపోతున్నారని అన్నారు. టీఆర్ఎస్ చీలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. సరైన సమయం కోసం హరీష్ వేచి చూస్తున్నారన్నారని, తనకు అవమానాలు జరుగుతున్నప్పటికీ గత్యంతరం లేకే ఆ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే హరీష్ రావు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండే వారని చెప్పారు.