యూపీలో బీజేపీ నేతలకు ఘాటైన సమాధానం చెప్పిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ శ్రేష్ఠా ఠాకూర్ పై బదిలీ వేటు పడిన సంగతి తెలిసిందే. గతంలో బులంద్ షెహర్ లో విధులు నిర్వహిస్తున్న ఆమెను బహ్రైచ్ కి బదిలీ చేయించారు సదరు బీజేపీ నేతలు. ఈ బదిలీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు మీడియా - అటు సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తనపై బదిలీ వేటు పడినా శ్రేష్ఠా ఠాకూర్ తన మనో నిబ్బరాన్ని కోల్పోలేదు. తనపై పడ్డ బదిలీ వేటు ఒక రివార్డు వంటిదని ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజాయితీగా డ్యూటీ చేయడంతో పాటు, తనను బదిలీ చేసిన చెక్కు చెదరని ఆత్మ స్థైర్యంతో ముందుకు వెళుతున్న ఈ లేడీ టైగర్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
‘నన్ను నేపాల్ సరిహద్దు ప్రాంతమైన బహ్రైచ్ కి బదిలీ చేశారు. కానీ మీరేం బాధపడకండి ఫ్రెండ్స్. నేను సంతోషంగానే ఉన్నా. నేను చేస్తున్న మంచి పనికి ఇదో రివార్డ్ గా భావిస్తాను. మీరంతా బహ్రైచ్ కి ఆహ్వానితులే. దీపం ఎక్కడుంటే అక్కడ వెలుగు నిండుతుంది. దీపానికి సొంత ఇల్లు అంటూ ఉండదు’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కి చాలా మంది నెటిజన్లు ‘బెస్ట్ ఆఫ్ లక్’ అని ఆ డైనమిక్ ఆఫీసర్ కు కామెంట్లు పెడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/