వర్మ.. బాబు గాలి మామూలుగా తీయట్లేదు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో లేనపుడు ఎంత బలహీనంగా కనిపిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ జన బలంతో కాకుండా వేరే అంశాలు కలిసొచ్చి ఆయన ముఖ్యమంత్రి అవుతూ వచ్చారు. 2004లో అధికారం కోల్పోయాక పదేళ్ల పాటు చాలా బలహీనంగా కనిపించిన చంద్రబాబు.. రాష్ట్ర విభజన కలిసొచ్చి 2014లో అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నో ఆశలతో ప్రజలు అధికారం కట్టబెడితే.. ఏమీ చేయకుండా ప్రచార ఆర్భాటాలతో ఐదేళ్లు కాలం గడిపేశారు. ఫలితం.. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాభవం.
2004 తర్వాత తెలుగుదేశం ఎంత బలహీనపడిపోయిందో.. నేతలు చేజారిపోతుంటే ఏమీ చేయలేక చంద్రబాబు ఎలా జావగారిపోయారో తెలిసిందే. ఇక ఇప్పటి పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజుల్లోపే నలుగురు ఎంపీలు జారిపోయారు. అటు వైపు ముఖ్యమంత్రి జగన్ విలువల గురించి మాట్లాడి ఫిరాయింపుల్ని ప్రోత్సహించట్లేదు కాబట్టి సరిపోయింది కానీ.. లేదంటే ఎమ్మెల్యేలు చాలామంది జంప్ అయిపోయేవాళ్లే. పరిస్థితి చూస్తుంటే అనుకున్నదాని కంటే వేగంగా తెలుగుదేశం పార్టీ పతనం చూస్తామేమో అనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబును వ్యతిరేకించేవాళ్లు ఆయన్ని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ అయితే తెలుగుదేశం ఓడిన నాటి నుంచి చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ కామెడీలు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు అభిమాని ఒకరు ఆయన్ని కలిసి కార్యకర్తలకు ధైర్యం చెబుతున్న వీడియో ఒకటి వర్మ ఫేస్ బుక్ లో పెట్టాడు. ఎవరో ఊరూ పేరు లేని అనామకుడితో ఈ సెల్ఫీ వీడియో దిగాడు చంద్రబాబు. అందులో ఆయన కనిపించడం కూడా చాలా బేలగా కనిపిస్తున్నారు. తన దేవుడు చంద్రబాబు అని.. ఇంతకుముందు, ఇప్పుడు అదే చెబుతున్నానని.. ఓటమి పాలైనంత మాత్రాన ఎవరూ అధైర్య పడాల్సిన పని లేదని.. చంద్రబాబు తన గుండెల్లో ఉంటారని ఆ వ్యక్తి చెబుతున్నాడు. మాటెత్తితే తాను జాతీయ నాయకుడినని.. ఢిల్లీలో చక్రం తిప్పుతానని చంద్రబాబు అంటుంటాడు. కానీ ఇలా ఎవరో ఊరూ పేరు లేని వ్యక్తితో కలిసి వీడియో దిగి అంత బేలగా కనిపించడంతో వర్మ తనదైన శైలిలో ఆడేసుకున్నాడు. చంద్రబాబును చూస్తే జాలేస్తోందని.. ఆయన హావభావాలు పేలవంగా ఉన్నాయని.. ఇక ఏడుపే తరువాయి అన్నట్లు కనిపిస్తున్నాడని వర్మ వ్యాఖ్యానించాడు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు చంద్రబాబును వర్మ లాంటి వాళ్లు ఎలా ఆడేసుకుంటారో అన్న సందేహాలు కలుగుతున్నాయి.