పవన్ - జేడీకి మధ్య చెడిందెక్కడ.?

Update: 2019-07-30 05:59 GMT
జనసేనాని పవన్ కు, ఆ పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు మధ్య చాలా దూరం పెరిగిపోయినట్టు ఇటీవల పవన్ ప్రకటించిన పార్టీ కమిటీలతో తేటతెల్లమైంది. జనసేన ప్రకటించిన రెండు కీలక కమిటీల్లోనూ లక్ష్మీనారాయణకు చోటు దక్కలేదు.  జనసేన తరుఫున విశాఖ ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన జేడీ లక్ష్మీనారాయణను పవన్ దూరం పెట్టారా? లేక ఆయనే దూరంగా జరిగారా అన్న సస్సెన్స్ ఇప్పుడు అందరిని పట్టిపీడిస్తోంది.

ఏపీ రాజకీయ యవనికపై దూసుకొచ్చిన నాయకుల్లో జేడీ లక్ష్మీనారాయణ ఒకరు.. ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టి రంగంలోకి దిగుదామని ఆలోచించారు. కానీ అంత శక్తిసామర్థ్యాలు లేకపోవడంతో టీడీపీలో చేరిపోతున్నారన్న ప్రచారం సాగింది.  కానీ చివరి నిమిషంలో జనసేనలో చేరారు. విశాఖ ఎంపీగా పోటీచేసి 3 లక్షలకు పైగా ఓట్లు సాధించారు.

అయితే జేడీ ఓడిపోయాక పార్టీలో చురుకుగా లేరన్న ప్రచారం సాగింది. ఆయన అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయని వార్తలు వచ్చాయి. జనసేనలో భవిష్యత్ లేదని అనుకున్న జేడీ బీజేపీలో చేరి ఏపీలో లీడ్ రోల్ పోషించాలని భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అందుకే జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టు సమాచారం.

మాజీ జేడీ లాంటి కీలక నేతను కష్టాల్లో ఉన్న జనసేన వదులుకునే పరిస్థితి లేదని.. ఆయనే జనసేనకు దూరంగా జరుగుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ బీజేపీ వైపు అడుగుల నేపథ్యంలోనే పవన్  ఆయనను దూరంగా పెట్టారన్న ప్రచారం సాగుతోంది. మరి జనసేన అనుకున్నట్టే లక్ష్మీనారాయణ బీజేపీలో చేరుతారా .? ఆయన నెక్ట్స్ స్టెప్ అటేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది.


Tags:    

Similar News