టు నాగబాబు : రోజా జబర్దస్త్ కౌంటర్

Update: 2023-01-07 16:30 GMT
ఆర్కే రోజా అన్నది రాజకీయ నామధేయం. రోజా అన్నది సినీ హీరోయిన్ గా రోజా తారాపధాన్ని సూచించే పేరు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన తారామణులు అతి తక్కువ మంది ఉంటే అందులో రోజా టాప్ ప్లేస్ లోనే ఉన్నారు. మంత్రిగా ఆమె ఏపీ సర్కార్ లో కీకలకంగా ఉన్నారు. నాలుగు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచారు.

ఒక విధంగా చూస్తే రోజా పొలిటికల్ కెరీర్ సక్సెస్ ఫుల్ గానే ఉంది అని చెప్పాలి. రేపటి ఎన్నికల్లో ఆమె ఓడినా పోయేది ఏమీ లేదు. ఇక తెలుగు సినీ సీమలో సూపర్ స్టార్ డం తో వెలిగిన వారు కూడా రాజకీయంగా ఏమీ కాలేకపోయారు. అది కూడా రోజా దూకుడుకు కారణం అయి ఉండవచ్చు. అందుకే ఆమె అలవాటుగానో లేక దూకుడుతోనే ఏకంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు.

ముగ్గురు బ్రదర్స్ సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు అని సెటైర్లు విసిరారు. ఇది నిజమే. కానీ దాన్ని ఎవరూ అంగీకరించలేరు. ఇక సినీ జనాభిమానం విశేషంగా ఉన్న మెగా ఫ్యామిలీ అసలు జీర్ణించుకోలేదు. పోనీ దీనితో వదిలేసినా ఓకే. కానీ రోజా మెగా బ్రదర్స్ ఏపీకి ఏమీ చేయలేదు అంటూ విమర్శలు దట్టించారు. దాంతోనే వ్యవహారం శృతిమించింది.

ఇపుడు జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూస్తున్నారు. ఈ టైంలో మెగా ఫ్యామిలీకి రాజకీయ కళ లేదని రోజా జాతకం చెప్పడం అంటే అది మామూలు విమర్శ కాదు. అందుకే మెగా బ్రదర్ నాగబాబు గట్టిగా తగులుకున్నారు. రోజా నోటిని ఏకంగా కుప్ప తొట్టెతో పోల్చారు.

పైగా ఆమె నిర్వహిస్తున్న పర్యాటక శాఖ ఏపీలో 18వ స్థానంలో ఉందని కూడా ఘాటు విమర్శలు చేశారు. మరి రోజా, అసలే ఫైర్ బ్రాండ్ ఊరుకుంటారా. అందుకే నాగబాబు మాటకు మాట అప్పచెప్పారు. ఫేక్ వార్తలను ప్రచారం చేయడం కాదు ఏపీ దేశంలో టూరిజం లో మూడవ స్థనంలో ఉంది అని చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి టూరిజం మినిస్టర్ గా ఉన్నపుడు ఏపీకి ఏమి చేశారంటూ తాను అడగబోమని, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో లేరు కాబట్టి అంటూ గట్టిగా కౌంటరేశారు.

నాగబాబు మహిళలను గౌరవించుకోవడం ఎలాగో తెలుసుకోవాలని కూడా రోజా చురకలు అంటించారు. ఇలా రోజా ఒకనాటి తన జబర్దస్త్ కో జడ్జి అయిన నాగబాబు మీద జబర్దస్త్ గా కామెంట్స్ చేశారు. మొత్తానికి చూస్తే రోజా తగ్గేది లే అంటున్నారు. పెట్టుకుని పెట్టుకుని మెగా ఫ్యాన్స్ తో ఆమె తగదా పెట్టుకుంటున్నారు. మరి దీని మీద నాగబాబు కౌంటర్ కోసం ఇపుడు ఎదురు చూడాల్సిందే. అటు వైపు నుంచి ఏమి తూటాలు పేలతాయో అని వెయిట్ చేయాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News