అప్ప‌ట్లో సాయిబాబా.. ఇప్పుడు 'రాహుల్ బాబా': సోనియా అల్లుడి కామెంట్‌

Update: 2022-10-30 15:46 GMT
కాంగ్రెస్  పార్టీ అగ్ర నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న జోడో యాత్ర‌పై సోనియాగాంధీ అల్లుడు, రాహుల్ బావ రాబ‌ర్ట్ వాద్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశా రు. తాజాగా షిర్డి సాయిబాబాను ద‌ర్శించుకున్న త‌ర్వాత‌.. ఆయ‌న మీడియాతోమాట్లాడుతూ.. ``అప్ప‌ట్లో సాయిబాబా.. ఇప్పుడు రాహుల్ బాబా.. ప్ర‌జ‌ల కోసం పాద‌యాత్ర చేస్తున్నాడు`` అని వ్యాఖ్యానించారు.  ఒకప్పుడు సాయిబాబా చేసిన పనినే ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నారని అన్నారు. అందుకే ఆయన ఇప్పుడు భారత్ జోడో యాత్ర చేపట్టారని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఐక్యం చేయడానికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ కలలను రాహుల్ గాంధీ నిజం చేస్తారని వాద్రా ధీమా వ్యక్తం చేశారు.

"లక్షలాది మంది ప్రజలు నిత్యం షిర్డీ వచ్చి బాబా దర్శనం చేసుకుంటున్నారు. వారి భావాలు ఏమిటో నేను తెలుసు కోవాలనుకుంటున్నాను. సాయిబాబా కులమతాలకు అతీతంగా.. ప్రజలంతా ఐక్యంగా ఉండాలని సందేశం ఇచ్చారు. ఈ రోజున దేశానికి ఇదే కావాలి. రాహుల్ గాంధీ ఆలోచన కూడా ఇలాంటిదే కనుక.. దేశాన్ని ఏకం చేయాలని జోడో యాత్ర చేపట్టారు. సర్వధర్మ సమానత్వం అనే ఆలోచన కూడా.. బాబాకు, రాహుల్కు ఉంది. ప్రస్తుతం దేశంలోని ప్రజలకు అన్యాయం జరుగుతోంది. కొన్ని కేసులు కారణంగా ఈడీ కార్యాలయం దాటి బయటకు రాలేకపోతున్నాం. దీని వలన నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడటం కుదరడం లేదు. మీడియా దృష్టంతా ఈడీ కేసుపైనే ఉంది. కనీసం మమ్మల్ని కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయటకు కూడా అనుమతించడం లేదు. ప్రియాంకా కూడా బారికేడ్లు దూకి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే మా కుటుంబం గురించి నిత్యం ప్రజలు ఆలోచిస్తుంటారు.`` అని వాద్రా పేర్కొన్నారు.

చేసిన ప్రతీ మంచి పని మీడియాకు తెలియాల్సిన అవసరం లేదని వాద్రా అన్నారు. దేశంలో కొందరు నేతలు మాత్రం.. ఏ పని చేసినా తెగ సెల్ఫీలు తీసుకుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్ జోడో యాత్రపై తనకు పూర్తిగా నమ్మకం ఉంద‌ని.. ప్రజలు కూడా రాహుల్ను నమ్ముతున్నారని తెలిపారు. దేశంలో ఎన్నికలు పూర్తవ్వగానే మళ్లీ ఈడీ దాడులు మొదలవుతాయన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి ప్రజలు భయపడుతు న్నారని.. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రజలు ఏనాడు భయపడలేదని.. ఆయనతో మమేకమైయ్యారని చెప్పారు. రాజీవ్ గాంధీ కలలను రాహుల్ గాంధీ నెరవేరుస్తారని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రస్తుతం ప్రియాంకా గాంధీ హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారని తెలిపారు. తానూ జోడో యాత్రను వెళ్తాను కానీ.. ప్రజల ముందుకు రాకుండా రాహుల్ భద్రత చూసుకుంటానని వెల్లడించారు. 
Tags:    

Similar News