ట్రెండింగ్: టైం లేదు మరీ.. రోబోట్స్ తో సెక్స్..

Update: 2020-01-20 04:39 GMT
పనిరాక్షసులుగా పేరుగాంచిన జపాన్ లో కనీసం నెలకు ఒక్కరోజు కూడా సెక్స్ చేసుకోని దంపతులున్నారని ఓ పరిశోధనలో తేల్చింది. ఇక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా చాలా దేశాల్లోని దంపతులు సంసార సుఖానికి దూరంగా బిజీగా గడుపుతున్నారు.వీరి అవసరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు మానవుల లైంగిక కోర్కెల తీర్చేందుకు మనుషులను పోలిన రోబోట్ లను తయారు చేస్తున్నారు. వీటితో తమ శృంగార వాంఛలను తీర్చుకోవచ్చని చెబుతున్నారు.

మగ, ఆడ రోబోట్ లను తయారు చేసి విక్రయించేందుకు చైనా, జపాన్, అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. 2030 వరకు ఇవీ అందరికీ అందుబాటు లోకి రానున్నట్టు సమాచారం. సో ఏది ఏమైనా రోబోట్స్ తో సెక్స్ కు మానవ సమాజం ఎంతో దూరంలో లేదనే వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది.

సినిమాల్లోనే కాదు.. ఇప్పటికే కొంతమంది సంపన్నులు రోబోలను తయారు చేసుకొని తమ సెక్స్ వాంచలకు ఉపయోగించుకుంటున్నారు. మనుషులు బిజీగా మారిన నేపథ్యం లో రోబోట్ లే వారికి స్వాంతన చేకూరుస్తున్నాయట.. పగలూ రాత్రి తేడా లేకుండా పనిచేయడం.. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుండిపోతున్నారు. శారీరక శ్రమ తగ్గి, మానసిక శ్రమ ఎక్కువైపోతోంది. ఈ నేపథ్యంలో అనుబంధాలకు దూరమవుతున్నారు. మానవ మనుగడ కు కీలకమైన సెక్స్ కు కూడా దూరమై పోతున్నారు.
Tags:    

Similar News