అదరహో అనేలా రోహిత్ క్యాచ్.. వహ్వా

Update: 2022-02-17 11:30 GMT
ఫీల్డింగ్ లో టీమిండియాలో అందరికన్నా నెమ్మదిగా కదిలే ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. అయితే, అది తన బాడీ లాంగ్వేజ్. అంతమాత్రాన అతడు క్యాచ్ లు జారవిడిచే రకం కాదు. చేతికందిన క్యాచ్ ను రోహిత్ మిస్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఫీల్డింగ్ లో అంత చురుగ్గా ఉండనప్పటికీ రోహిత్ ను స్లిప్ లో ఉంచుతుంటారు. టి20, వన్డే, టెస్టులు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ స్లిప్ ఫీల్డింగ్ లో ఉంటాడు రోహిత్. అయితే, మైదానంలో మాత్రం వేగంగా కదల్లేడన్న అభిప్రాయం ఉంది.

బంతి కోసం పరుగెత్తడంలో కానీ, డైవ్ చేయడంలో కానీ రోహిత్ చాలా నెమ్మది. ఈ విషయం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. కానీ, రోహిత్ లాంటి క్లాస్ బ్యాట్స్ మన్ కు అదేమంత వంక పెట్టదగిన లోపంగా ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. అయితే, బుధవారం వెస్టిండీస్ తో జరిగిన తొలి టి20లో రోహిత్ చురుకైన క్యాచ్ పట్టి అద్భుతం అనిపించాడు. బహుశా రోహిత్‌ అందుకున్న స్టన్నింగ్‌ క్యాచ్‌లలో ఇదొకటి.

అంతేకాదు.. బ్యాట్స్‌మన్‌గా క్రీజులో పరుగులు తీయడానికి పెద్దగా ఇష్టపడని రోహిత్‌.. ఫీల్డింగ్‌లోనూ ఎక్కువ ఒత్తిడి తీసుకోవడానికి ఇష్టపడడు. కానీ తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో మాత్రం టీమిండియా కెప్టెన్‌ ఒహో అనిపించే క్యాచ్‌తో మెరిశాడు. 34 ఏళ్ల వయసులో తన ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌ ఎలాంటి సందేహాలు పెట్టుకునే అవకాశం లేకుండా చేశాడు.

సూర్యకుమార్ ను కాదని చురుకైన క్యాచ్ ను అందుకుని..కోల్ కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన తొలి టి20లో విండీస్‌ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను హర్షల్ పటేల్‌ వేశాడు. ఓడియన్‌ స్మిత్‌ మిడాఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. బంతిని అందుకునేందుకు లాంగాఫ్‌ నుంచి సూర్యకుమార్‌ దూసుకువస్తున్నాడు. అయితే, ఎక్స్‌ట్రా కవర్‌ నుంచి రోహిత్‌ వెనుకకు పరిగెత్తుతూ డైవ్‌ చేసి సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

 అటు సూర్యకుమార్‌తో పాటు మిగతా ఆటగాళ్లను, కామెంటేటర్లను .. స్టన్నింగ్‌ క్యాచ్‌తో షాక్‌కు గురిచేశాడు. రోహిత్‌ క్యాచ్‌కు క్రీడా పండితులు కూడా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్‌ స్టన్నింగ్‌ ఫీట్‌ చూసిన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

కెప్టెన్‌అయ్యాక కొత్త రోహిత్‌ కనిపిస్తున్నాడు అంటున్నారు. ఇక్కడ మరో విషయమూ చెప్పుకోవాలి. ఓడియన్ స్మిత్ ఆడిన షాట్ కు బంతి గాల్లోకి లేచినా.. మరీ అంత వేగంగా లేదు. దీంతో రోహిత్ క్యాచ్ అందుకోవడమూ సులభమైంది.

మొత్తం క్యాచ్ ఇలాపైన చెప్పుకొన్నట్టు టీమిండియాలో మూడు ఫార్మాట్లలోనూ స్లిప్ ఫీల్డింగ్ ప్రథమ ప్రాధాన్యం రోహిత్ శర్మనే. ఇప్పటివరకు 43 టెస్టులాడిన రోహితన 45 క్యాచ్ లు అందుకున్నాడు. 230 వన్డేల్లో 82 క్యాచ్ లు, 120 టి0ల్లో 46 క్యాచ్ లు పట్టాడు. మొత్తంమీద వంద క్యాచ్ లు పైనేఅందుకున్నాడు.

ఫీల్డింగ్ లో మరీ అంత పూరా?టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు గత రెండు దశాబ్దాల్లో బాగా పెరిగాయి. ముఖ్యంగా ఐపీఎల్ వచ్చాక జట్టు ఫిట్ నెస్ స్వరూపమే మారిపోయింది. అత్యంత పోటీతత్వంతో కూడుకునే టి20ల రాక.. అందులోనూ ఐపీల్ వంటి లీగ్ కారణంగా ఫిట్ నెస్ స్థాయిలు పెరిగాయి. అన్ని జట్లూ ఇప్పుడు ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి.

భారత జట్టు అయితే.. యోయో విధానాన్ని అవలంబిస్తోంది. ఈ మార్కును అందుకోవడం చాలా కష్టం. ఒకరిద్దరు యోయో ఫిట్ నెస్ స్థాయికి దగ్గరగా రాలేక జట్టుకు దూరమయ్యారు కూడా. అయితే, రోహిత్ మైదానంలో చురుగ్గా కదల్లేకున్నా.. ఎన్నడూ యోయోలో ఫెయిల్ కాలేదు. అంటే నిర్దిష్ట ప్రమాణాలను అందుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు రోహిత్ బాడీ లాంగ్వేజ్ ప్రకారమే అతడు మైదానంలో బద్ధకంగా కనిపిస్తుంటాడని తెలుస్తుంది. తనది కొంచెం ఆలస్యంగా కదిలే తీరు. అంటే శరీర తత్వం నెమ్మది. విరాట్ కోహ్లిలా ఎటు అంటే అటు వంగదు. బ్యాటింగ్ లోనూ ఆ శైలి ప్రతిబింబిస్తుంటుంది.

 రోహిత్ కొన్నిసార్లు చాలా పేలవంగా ఔటనట్లు కనిపిస్తుంటుంది. అదికూడా అతడి స్థాయికి తగనట్లుగా. కానీ, దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాటల్లో చెప్పాలంటే అది రోహిత్ స్టయిల్. ఒక బంతిని పది రాలుగా ఆడే సామర్థ్యమున్న రోహిత్ అలా పేలవడం ఔటవడానికి సందిగ్ధతే కారణం.
Tags:    

Similar News