ఆ లాయ‌ర్ గారి ఆస్తి 10,000 కోట్లు

Update: 2016-12-13 05:32 GMT
నిజంగా నిజం. ఆ లాయ‌ర్ గారి ఆస్తి 10,000 కోట్లు. దేశ రాజధానికి చెందిన ప్రముఖ న్యాయవాది రోహిత్ టాండన్ కు చెందిన టీ అండ్‌ టీ లా కంపెనీపై ఇటీవల ఢిల్లీ పోలీసులు దాడిచేసి రూ.13.65 కోట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో రూ. 2.60 కోట్ల నగదు 2000 నోట్లు కావడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఒక సెక్యూరిటీ గార్డు మాత్రమే కాపలా ఉన్న అతడి సంస్థలో డబ్బు లెక్కింపు యంత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే టాండన్‌ కు చెందిన మొత్తం ఆస్తులు రూ.10 వేల కోట్ల వరకు ఉంటాయని తెలిసి అధికారులు ఖంగుతున్నారు.

అనంత‌రం టాండన్‌ పై దర్యాప్తు జరుపగా అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. రోహిత్ టాండన్‌ కు దుబాయ్‌ లో ఇల్లు - ఢిల్లీలోని ఛత్తార్‌ పూర్‌ లో రెండు లగ్జరీ ఫామ్‌ హౌస్‌ లు - ఖరీదైన పంచశీల్ ప్రాంతంలోనూ రెండు నివాసాలున్నాయి. మధ్య ఢిల్లీలోని జోర్‌ భాగ్‌ లో ఉన్న ఇతడి ఇంటి విలువ రూ.100 కోట్లు. గత ఏడాదే దీనిని కొనుగోలు చేశాడు. టాండన్ లాయర్ల కుటుంబం నుంచి వచ్చాడు. ఇతడి తండ్రి హర్యానా - ఛత్తీస్‌ గఢ్‌ లలో జడ్జిగా పనిచేశారు. గత ఏడాది చనిపోయారు. తన స్నేహితుడైన వివేక్ కోహ్లీతో కలిసి 2005లో టాండన్ జియస్ లా కంపెనీని ప్రారంభించాడు. కోహ్లీ తండ్రి చీఫ్ ఇన్‌ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అనంతరం టాండన్ 2014లో టీఅండ్‌ టీ లా కంపెనీని ప్రారంభించాడు. ఇతడి కొడుకు వరుణ్‌టాండన్ టీఅండ్‌ టీ లో లాయర్. రూ.100 కోట్లు వెచ్చించి వరణ్ వివాహాన్ని నిరుడు వైభవంగా జరిపించాడు.

కాగా..ఛత్తీస్‌ గఢ్ - హర్యానా హైకోర్టు జడ్జీలతో టాండన్ లాబీయింగ్ నిర్వహించేవాడు. ఈ ఏడాది అక్టోబర్‌ లో ఇతడి కంపెనీపై ఆదాయం పన్ను అధికారులు దాడి చేయడంతో ఒక్కసారిగా టాండన్ తెరపైకి వచ్చాడు. ఈ సందర్భంగా తన వద్ద రూ.125 కోట్ల అక్రమ సంపాదన ఉన్నట్టు చిన్నలెక్క చెప్పాడు. ఇటీవల దాడి జరిగిన ఇంట్లోనే 21 రోజుల క్రితం కూడా రూ.1.25కోట్ల నగదును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు కనుగొన్నారు. ఇతర దేశాలతోపాటు భారత్‌ లోనూ టాండన్‌ కు వివిధ బ్యాంకుల్లో 18 ఖాతాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News