దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వివాదంలో మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఆయన ఉరి వేసుకోవటానికి ఒక పార్టీ బ్యానర్ ను వినియోగించినట్లుగా చెబుతున్నారు. సదరు బ్యానర్ వ్యవహారాన్ని చెబుతూ. సదరు బ్యానర్ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కు చెందిన బ్యానర్ తో ఉరి వేసుకున్నట్లుగా తెలుస్తోంది.
వర్సిటీలో పీహెచ్ డీ స్కాలర్ గా ఉన్న రోహిత్ నేపథ్యం గురించి అతగాడు రాసుకున్నఅంశాల్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. తన తల్లి తనను కుట్టుమిషను కుట్టి పెంచిందని.. కుట్టుమిషనే తమ కుటుంబానికి ఆధారమంటూ రోహిత్ 2014 ఫేస్ బుక్ పేజీలో రాసుకున్నారు.
వర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలతో రోహిత్ కు ఫెలోషిప్ రాకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకున్నాడని.. ఆదివారం తన సహచర విద్యార్థులతో కలిసి నిరసన ప్లాన్ గురించి చర్చ జరిపిన తర్వాతే ఆత్మహత్య చేసుకోవటం గమనార్హం. రోహిత్ తన ఆత్మహత్య లేఖలో ఒంటరితనం లాంటి అంశాల్ని ప్రస్తావించటం గమనార్హం.