పురపాలక శాఖా మంత్రి నారాయణ నిర్మాత...లెజెండ్, సింహా చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్..చంద్రబాబు హీరో టైటిల్ బాబుబలి...ఏంటి సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ కథేంటి అనుకుంటున్నారా...ఈ కథ చెప్పింది ఎవరో కాదు ప్రముఖ సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా. రోజా చెప్పిన ఈ సినిమా కథేంటంటే పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్బంగా ప్రతిపక్షాలు ఈ అంశంపై రాద్దాంతం చేసి ప్రభుత్వంపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్‌తో పాటు పలువురు వైకాపా ఎమ్మెల్యేలు కూడా ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు.
ముందుగా ఈ అంశంపై జగన్ మాట్లాడుతూ పుష్కరాల్లో భక్తులు చనిపోతే చంద్రబాబు మేకప్ వేసుకుని షూటింగ్ చేశారని విమర్శించారు. చంద్రబాబు దగ్గరుండి 29 మంది మృతికి కారణమయ్యారని జగన్ ఆరోపించారు. పుష్కర మృతుల పట్ల చంద్రబాబు ప్రసంగం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని జగన్ అన్నారు.
అనంతరం ఇదే అంశంపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ రాజమండ్రి పుష్కరాల ప్రారంభం రోజున చంద్రబాబు బాబుబలి అనే ప్లాప్ సినిమా తీశారని ఆమె విమర్శించారు. ఇక ప్రత్యేక హోదా మృతుల గురించి ఆమె మాట్లాడుతూ సర్కారీ హత్యలకు సంతాపాలు అవసరం లేదన్నారు. తహసీల్దార్ వనజాక్షి విషయం, రిషితేశ్వరి ఆత్మహత్య ఉదంతం, ఎలుకలు పపిగుడ్డును చంపేయడం లాంటి అంశాలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు నిజంగానే మంచి పనులు చేసి ఉంటే పదేళ్లపాటు ప్రజలు ఆయన్ను ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోబెడతారని రోజా నిలదీశారు.