వేర్ల‌ను వ‌దిలేసి కొమ్మ‌లు..ఆకులా :రోజా

Update: 2017-07-26 05:57 GMT
డ్ర‌గ్స్ విచార‌ణ జ‌రుగుతున్న తీరుపై సినీ వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు ఒక్కొక్క‌టిగా మొద‌ల‌వుతున్నాయి. మొన్న‌టికి మొన్న సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ సిట్ విచార‌ణ‌పై వేలెత్తి చూపించ‌ట‌మే కాదు.. ముంబ‌యిలో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ గురించి చాలా చెడ్డ‌గా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే.

త‌న మ‌న‌సులోని ఫీలింగ్స్ ను ఏ మాత్రం దాచుకోకుండా మాట్లాడే వ‌ర్మ.. డ్ర‌గ్స్ విచార‌ణ తీరుపై విమ‌ర్శ‌లు చేస్తూ.. సినిమా ఇండ‌స్ట్రీ వైపు మాట్లాడారు. ప‌నిలో ప‌నిగా మీడియా మీదా త‌న అక్క‌సును ప్ర‌ద‌ర్శించారు.

తాజాగా అదే తీరులో రియాక్ట్ అయ్యారు ఏపీ పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ క‌మ్ సినీ న‌టి రోజా. డ్ర‌గ్స్ వాడ‌కాన్ని అరిక‌ట్ట‌టంలో తెలంగాణ‌.. ఏపీ స‌ర్కారులు.. నిఘా వ‌ర్గాలు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని ఆరోపించారు.  పెద్ద‌ల్ని వ‌దిలేసి కావాల‌నే సినిమా వాళ్ల‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ విమ‌ర్శించారు.

వేర్ల‌ను వ‌దిలేసి.. కొమ్మ‌ల్ని.. ఆకుల్ని ప‌ట్టుకుంటే ఫ‌లితం ఉండ‌ద‌న్న రోజా.. కేవ‌లం రేటింగ్ కోస‌మే కొన్ని మీడియా సంస్థ‌లు సినీ తార‌ల ప‌రువును బ‌జారుకు ఈడుస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. చిత్తూరు క‌లెక్ట‌రేట్ లో మాట్లాడిన రోజా.. డ్ర‌గ్స్ వినియోగంలో చాలామంది ప్ర‌ముఖులు ఉన్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

డ్ర‌గ్స్ వాడే ప్ర‌ముఖుల్ని ఏమీ చేయ‌లేక వారిని వ‌దిలేసి.. సినీ తార‌ల్ని ఇబ్బంది పెడుతున్నార‌ని మండి ప‌డ్డారు.
Tags:    

Similar News