ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగింది. ప్రతీ చోటా వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోరులో వైసీపీని ఓడించేందుకు ప్రయత్నించిన సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు.
నగరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో వైసీపీని ఓడించి తనను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
పార్టీలో ద్రోహులపై ఇప్పటికైనా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. పార్టీలో వెన్నుపోటు దారులపై రోజా చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరుకునపెట్టాయి. వైసీపీ హవాలో నగరి నియోజకవర్గం పరిధిలోని పుత్తూరు, నగరి మున్సిపాలిటీలను దక్కించుకున్న తర్వాత రోజా చేసిన వ్యాఖ్యలు పార్టీలో సైతం సంచలనం రేపుతున్నాయి. వైసీపీలో ఉంటూ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన ప్రత్యర్థుల్ని తొక్కిపారేశానంటూ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో సైతం సంచలనం రేపాయి.
పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో వైసీపీని ఓడించడం ద్వారా సదురు నేతలు తనను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ రోజా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు జిల్లా మంత్రిని ఉద్దేశించి చేసినవేనన్న చర్చ ఆ జిల్లాలో జోరుగా సాగుతోంది. చిత్తూరు జిల్లాలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలు తనకు మంత్రి రాకుండా అడ్డుకున్నారంటూ రోజా గతంలోనే ఆరోపించిన సంగతి తెలిసిందే.