ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏడాది కాలం పాటు సస్పెన్షన్ విధిస్తూ ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై విపక్ష నేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడుతూ.. ఒక మహిళా శాసనసభ్యురాలి మీద అలా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించటంతో పాటు.. ఆమె మీద సస్పెన్షన్ ను ఎత్తి వేయకుంటే తాము అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరిస్తామంటూ అలిగి వెళ్లిపోవటం తెలిసిందే. రోజా సస్పెన్షన్ మీద ఏపీ స్పీకర్ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారా? ఆమె ఎలాంటి తప్పు చేయలేదా? జగన్ ఆగ్రహం సమంజసమేనా? లాంటి ప్రశ్నలు వేసుకొని.. లోతుల్లోకి వెళితే కాస్తంత విస్మయం.. ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా? అన్న భావన కలగటంతో పాటు.. జగన్ చెబుతున్నట్లు ఒక మహిళ విషయంలో ఏడాది సస్పెన్షన్ వ్యవహారం చిన్నదన్న భావన కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఎందుకంటే.. రోజా చేసిన వ్యాఖ్యలు అలాంటివి. ఆసుపత్రిలో కదల్లేని పరిస్థితుల్లో కనిపిస్తూ.. కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ ను కొన్ని ఛానళ్లు ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఇలాంటి రోజా అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్ద నిలుచొని చేసిన వ్యాఖ్యలు విన్నప్పుడు విస్మయం కలగక మానదు. ఒక గౌరవ మహిళా శాసనసభ్యురాలి నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తాయా? అని అనిపించక మానదు కూడా.
‘‘రోజుకొకడితో పడుకునే నువ్వేంటి మాట్లాడేది?’’.. ‘‘కామ చంద్రబాబు.. సెక్స్ ముఖ్యమంత్రి’’ లాంటి పదాలతో రోజా చెలరేగిపోయిన వైనం చూసినప్పుడు ఎవరు మాత్రం ఏం అనగలరు? ‘‘రోజుకొకడితో పడుకునే నువ్వేంటి మాట్లాడేది?’’ అంటూ ఒక దళిత మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి రోజా వ్యాఖ్యలు చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక గౌరవనీయ మహిళా శాసనసభ్యురాలి నోటి నుంచి ఇలాంటి మాటల్ని ఊహించగలమా? మరి.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని విపక్ష నేత హోదాలో ఉన్న జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు. రోజాను సమర్థించటం ద్వారా.. తన పార్టీ నేతలకు జగన్ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?
రోజా విషయంలో ఇప్పుడు ఇన్ని మాటలు చెబుతున్న జగన్.. ఒకవేళ ఇలాంటి వ్యాఖ్యల్నే ఏ మహిళా శాసనసభ్యురాలైనా సరే.. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఆయన ఎలా స్పందించేవారు..? అన్న ప్రశ్నలు వేసుకుంటే.. రోజాకు తాజాగా విధించిన ఏడాది సస్పెన్షన్ సమంజసంగా అనిపించకమానదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి కామ చంద్రబాబు.. సెక్స్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం గౌరవనీయమైన పద్ధతి. ఇలా.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అమర్యాదగా మాట్లాడటాన్ని స్వాగతించాలా? నెత్తి మీద పెట్టుకోవాలా? విమర్శలకు.. ఆరోపణలకు ఒక హద్దు ఉంటుంది. అది హద్దులు దాటితే సమంజసంగా ఉండదు. అందులోకి గౌరవనీయ స్థానాల్లో ఉన్న వారి నోటి నుంచి ఇలాంటి మాటలు రావటం ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని జగన్ లాంటి పార్టీ అధినేతలు గుర్తించకపోవటం అసలుసిసలు విషాదంగా చెప్పాలి.