పోర్చుగీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నాస్ర్ ఫుట్ బాల్ క్లబ్ లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 37 ఏళ్ల ఈ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ 2025 వరకు అల్ నాస్ర్ క్లబ్ తరఫున ఆడేందుకు సంతకం చేసినట్లు ఆ క్లబ్ నిర్వహాకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కొద్దిరోజుల కిందటే 2022 ఫిఫా వరల్డ్ కప్ ఖతర్ వేదికగా ముగిసింది. ఫిఫా 2022 వరల్డ్ కప్ ను అర్జెంటీనా గెలుచుకుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ మెస్సి ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకోవాలనే తన కలను నిజం చేసుకున్నాడు. మరోవైపు ఫిఫా 2022 వరల్డ్ కప్ లో పోర్చుగీస్ క్వార్టర్ ఫైనల్స్ లో మొరాకో చేతిలో ఓడిపోయింది.
ఈ ఏడాది నవంబర్లో మాంచెస్టర్ యునైటెడ్‌తో తన ఒప్పందాన్ని రోనాల్డో రద్దు చేసుకున్నాడు. ఈక్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో క్లబ్ ప్రధాన కోచ్ ఎరిక్ టెన్ హాగ్ మరియు మేనేజ్‌మెంట్ టీమ్‌ను తీవ్రంగా విమర్శిలు గుప్పించాడు. అనంతరం ఖతర్ వేదికగా జరిగిన ఫిపా వరల్డ్ కప్ లో రోనాల్డో కేవలం ఒకే గోల్ చేసి నిరాశ పరిచాడు.
గత ఏడాది క్రితం గల్ఫ్ వెళ్లిన రొనాల్డో క్రమంగా పోర్చుగల్‌కు బెంచ్‌కి దిగజారాడు. అలాగే మాంచెస్టర్ యునైటెడ్‌కు క్రమంగా దూరమయ్యాడు. ఈ క్రమంలోనే పోర్చుగల్ ను వీడి సౌదీ అరేబియాకు చెందిన అల్ నాస్ర్ ఫుట్ బాల్ క్లబ్ లో చేరాడు. 2025 వరకు ఆ దేశం తరుపున రొనాల్డో ఆడేందుకు తాజాగా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
రోనాల్డ్ రాకను స్వాగతిస్తూ ఆ క్లబ్ నిర్వాహకులు "చరిత్ర నిర్మాణంలో ఉంది.. ఇది మా క్లబ్‌కు మరింత గొప్ప విజయాన్ని సాధించడానికి మాత్రమే కాకుండా మా లీగ్.. మన దేశం మరియు భవిష్యత్ తరాలు.. అబ్బాయిలు మరియు అమ్మాయిలు తమలో తాము అత్యుత్తమ వెర్షన్‌గా ఉండేలా స్ఫూర్తినిచ్చే సంతకం.. క్రిస్టియానో మీ కొత్త హోమ్ కి స్వాగతం"మంటూ అధికారిక సోషల్ మీడియా ట్వీట్ చేశారు.
ఈ మేరకు పశ్చిమ ఆసియాలో రొనాల్డో ఏడాదికి 200 మిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా సంపాదించే అవకాశం ఉందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మరిన్ని నివేదికలు మాత్రం అతడు ఏడాదికి 75 మిలియన్లను పొందుతాడని పేర్కొన్నాయి. వీటితోపాటు కొన్ని ప్రోత్సాహకాలు.. ప్రకటన రాబడి మరియు అమ్మకాలలో కొంత శాతం దక్కుతుందని పేర్కొన్నాయి.
ఈ విషయంపై రొనాల్డో స్పందిసతూ "యూరోపియన్ ఫుట్‌బాల్‌లో నేను గెలవాలని అనుకున్న ప్రతి దాన్ని గెలుచుకున్నందుకు నేను అదృష్టవంతుడిని.. ఆసియాలో నా అనుభవాన్ని పంచుకోవడానికి ఇదే సరైన తరుణమని భావిస్తున్నా" అని రొనాల్డో పేర్కొన్నాడు. ఈక్రమంలోనే అతడు తొలిసారి ప్రధాన యూరోపియన్ లీగ్‌లను విడిచిపెట్టాడని స్థానిక మీడియా నివేదించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.