కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామికి సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా సీనియర్ నాయకులతో రోజుకో తలనొప్పి వచ్చి పడుతోంది. రెండు పార్టీల నాయకుల మధ్య ఆరంభం నుంచి సమన్వయం లేదని చెప్పవచ్చు. అయితే తాజాగా సీనియర్ నేతల మధ్య వాక్ సమరం - ట్వీట్ సమరం, అంతర్ యుద్ధం జరుగుతుండటంతో సీఎం కుమారస్వామికి దిక్కు తోచని పరిస్థితి ఎదురు అవుతోంది. సీనియర్ నాయకులను ఏమీ అనలేని పరిస్థితి.. దీనికి తోడు కొందరు కాంగ్రెస్ నాయకులు కావడంతో సీఎం మౌనం వహించడం తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని చెప్పవచ్చు. దీంతో సంకీర్ణ ప్రభుత్వంలోని అసమ్మతి నేతలు సీఎం కుమారస్వామికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని చెప్పినా సందేహం లేదు.
మాజీ సీఎం సిద్ధరామయ్య తీరును వ్యతిరేకిస్తూ రెండు పార్టీల్లోనూ రాజీనామా చేసేందుకు నాయకులు సిద్ధమయ్యారు. ఇప్పటికే జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే మాజీ మంత్రులు రామలింగారెడ్డి - రోషన్ బేగ్ కూడా సిద్ధరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సిద్ధరామయ్యతో పలుమార్లు సమావేశమైన సీఎం కుమారస్వామి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేని స్థితిలో మౌనం వహిస్తున్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వం మనుగడకు తనవంతు సాయం చేస్తున్నట్లు సిద్ధరామయ్య ఇటీవల ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడి వచ్చారు. ఈక్రమంలో మాజీ సీఎం తీరుపై వస్తున్న వ్యతిరేక భావనలపై సీఎం కుమారస్వామికి తలనొప్పి తెచ్చి పెడుతోంది.
కాంగ్రెస్ నుంచి అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకీ మారుతోంది. సంకీర్ణ ప్రభుత్వం కావడంతో అందరికీ కేబినెట్ బెర్తులు లభించడం కష్టం. ఫలితంగా సీనియర్ నాయకులు పార్టీ పెద్దలపై మాటల యుద్ధం మొదలుపెట్టారు. సమన్వయ సమితిలో తనకు చోటు కల్పించకుండా చైర్మన్‌గా ఉన్న సిద్ధరామయ్య అడ్డుపడుతున్నారని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ బహిరంగ విమర్శలు చేశారు. సిద్ధరామయ్య కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిందని మాజీ మంత్రులు రోషన్ బేగ్ - రామలింగారెడ్డి ఆరోపించారు. అయితే రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించాలంటూ ముఖ్యమంత్రి కుమారస్వామిపై ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలోనే సీనియర్ నాయకుల మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంత్రివర్గంలో ఉన్న మూడు ఖాళీలను స్వతంత్య్ర అభ్యర్థుల ద్వారా భర్తీ చేసుకొని సంకీర్ణ ప్రభుత్వం బలాన్ని పెంచుకోవాలని కుమారస్వామి ఆలోచిస్తుంటే మంత్రి పదవుల కోసం ఇరు పక్షాల నుంచి పోటీ రోజురోజుకీ పెరుగుతోంది.
గత 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ సీట్లు రాలేదు. దీంతో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆరంభం నుంచి ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కుస్తీ పడుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి గతంలో కన్నా ఎక్కువ సీట్లు రావడంతో కమలనాథుల నుంచి వస్తోన్న ఒత్తిళ్లకు కాంగ్రెస్ – జేడీఎస్ నేతలు భయపడిపోతున్నారు. అయితే రెండు పార్టీల్లోని సీనియర్ లను నియంత్రించలేక ఓ గుమాస్తాలా పని చేయాల్సి వస్తోందని సీఎం కుమారస్వామి వాపోతున్నారు. అప్పట్లోనే సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందనే వార్తలు వచ్చాయి. కాగా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సంకీర్ణ పక్షాలకు ఓటమి ఎదురవడంతో మళ్లీ ప్రభుత్వం నైరాశ్యంలో పడిపోయిందని చెప్పవచ్చు.