రాహుల్ పాదయాత్రకు రూట్ మ్యాప్ రెడీ అవుతోంది

Update: 2022-06-08 05:58 GMT
కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి ఆ పార్టీ అగ్రనేత నడుంబిగించబోతున్నారు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయటం ద్వారా పార్టీకి జవసత్వాలు అందించాలని, పెద్ద ఎత్తున యువతను పార్టీ వైపు ఆకర్షించాలనే టార్గెట్లతో రాహుల్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్ర ఆరంభించబోతున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు పీసీసీ నేతలు చెప్పారు.

ఈ మధ్య రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో జరిగిన మూడు రోజుల  చింతన్ శివిర్ లో తీసుకున్న అనేక నిర్ణయాల్లో పాదయాత్ర కూడా ఒకటి. కన్యాకుమారిలో మొదలవబోతున్న పాదయాత్రలో ప్రతి జిల్లాను టచ్ చేయాలని డిసైడ్ చేసింది.

ప్రతి జిల్లాలో 75 కిలో మీటర్లు పాదయాత్ర ఉండేట్లుగా నేతలు రూట్ మ్యాప్ ను డిజైన్ చేస్తున్నారు. రాహుల్ పాదయాత్ర రూటు మ్యాపు రెడీ చేసి తమకు పంపాలని ఐఏసీసీ సీనియర్ నేతల ఆదేశాల కారణంగా తమిళనాడు నేతలు కసరత్తు చేస్తున్నారు.

ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోని నేతలే రూటుమ్యాపును డిసైడ్ చేయాలని ఏఐసీసీ వర్గాలు రాష్ట్రాల పీసీసీలను ఆదేశించింది. ఇందులో భాగంగానే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర పీసీసీ వర్గాలు రూటు మ్యాపులను రెడీచేస్తున్నాయి. రాహుల్ తో ఉండాల్సిన నేతలెవరు, ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేదెవరు ? పార్టీపరంగా భద్రతలో ఎవరుంటారు ? లాంటి అనేక అంశాలను రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు, సీనియర్ నేతలు మ్యాపును తయారుచేస్తున్నారు.

 పీసీసీ అధ్యక్షులు కూడా తమ రాష్ట్రాల్లో  ఏఏ నేతలకు కేటాయించాల్సిన బాధ్యతలపై ఇప్పటికే సమావేశాలు పెట్టుకుంటున్నారు. కన్యాకుమారి నుండి మొదలయ్యే పాదయాత్ర కాశ్మీర్ లో ముగియబోతోంది. ప్రారంభం వరకు ఓకేనే కానీ ముగింపే అనుమానంగా ఉంది.

కాశ్మీర్ లో పరిస్ధితులు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ప్రతిరోజు తీవ్రవాదులకు మిలిటరీకి మధ్య కాల్పులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయటమంటే రాహుల్ పెద్ద సాహసం చేస్తున్నట్లే లెక్క. ఎందుకంటే ఇంతవరకు దేశంలోని ఒకమూల  నుండి ఇంకోమూలకు పాదయాత్ర చేసిన నేతలెవరు లేరు. మరి పార్టీ పునరుత్తేజానికి  రాహుల్ చివరి ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో చూడాల్సిందే.
Tags:    

Similar News