టీ కప్పులో తుపాను మాదిరి సీన్ మరోసారి రిపీట్ అయ్యింది. ఎప్పటిలానే రోటీన్ క్లైమాక్స్ వచ్చింది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. ఆ పార్టీ ఉనికి అంతకంతకూ ప్రశ్నార్థకం అవుతుందన్న విషయాన్ని తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేయటం తెలిసిందే. దీంతో.. పార్టీ నాయకత్వం మీద మరోసారి హాట్ డిస్కషన్ షురూ అయ్యింది.
పార్టీలో గాంధీ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నట్లుగా కనిపించే కూటమి చేసే ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీచీఫ్ సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నాలుగున్నర గంటల పాటు వాడీవేడీగా సాగింది. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఐదు రాష్ట్రాల ఫలితాలపై రివ్యూ చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమేనని సోనియాగాంధీ ఎప్పటి మాదిరే చెప్పేసి..తనకున్న రాజకీయ వైరాగ్యాన్ని చెప్పకనే చెప్పేశారు.
తనకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి అక్కర్లేదని ఎంత చెప్పినా.. టీ కప్పు తుపాను మాదిరి సోనియా నాయకత్వం మీద కాంగ్రెస్ కోర్ కమిటీ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించింది. దీంతో రోటీన్ క్లైమాక్స్ ఈసారి చోటు చేసుకుందని చెప్పాలి.
మొదట పార్టీ నాయకత్వ మార్పుపై జోరుగా చర్చలు.. చివరకు గాంధీ కుటుంబమే దిక్కు అన్న రీతిలో తుది నిర్ణయం ఉండటం గడిచిన కొన్నేళ్లుగా వస్తున్నదే. తాజాగా అలానే జరిగింది.
రాబోయే ఎన్నికల్లో రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేలా..పార్టీని బలోపేతం చేసేలా తక్షణ మార్పులకు శ్రీకారం చుట్టాలని డిసైడ్ చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల అనంతరం పార్టీలో చింతన్ శిబిర్ నిర్వహిస్తామని.. పార్టీ బలోపేతం చేసేందుకు అధ్యక్షురాలు తక్షణ చర్యలు చేపడతారని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. చింతన్ శిబిర్ ను తాము అధికారంలో ఉన్న రాజస్థాన్ లో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్న సోనియా.. రాహుల్.. ప్రియాంకల నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ ముందు పెట్టగా.. వారి ప్రతిపాదనను సభ్యులంతా ఏకగ్రీవంగా రిజెక్టు చేసినట్లుగా చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. ఎవరెన్ని చెప్పినా.. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబాన్ని పక్కన పెట్టి.. పార్టీ పగ్గాల్ని అందుకునే ధైర్యం ఎవరూ చేయరన్న విషయం తాజా ఎపిసోడ్ తో మరోసారి నిరూపితమైంది.