హైదరాబాద్ లో తొలిసారి భారీ జరిమానా.. ఎవరికేశారంటే?

Update: 2019-10-04 05:38 GMT
కొత్త వాహన చట్టంతో దేశ ప్రజలకు ఫైన్ల షాకు తగిలిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ షాకులకు నో చెబుతూ.. ఆ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు కాకుండా నిర్ణయం తీసుకున్నాయి. అలాంటి రాష్ట్రాల కోవలోకే వస్తాయి రెండు తెలుగు రాష్ట్రాలు. అయితే.. పోలీసులు భారీగా జరిమానా విధించకున్నా.. కోర్టులకు మాత్రం ఆ వెసులుబాటు ఉన్న నేపథ్యంలో.. తాజాగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు భారీ ఫైన్లను విధించింది.

ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి భారీగా ఫైన్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్న వైనం సంచలనంగా మారింది. ఇంతకాలం ఈ తప్పు చేసి పట్టుబడిన వారికి రూ.2వేల జరిమానాతో సరిపెట్టేవారు. తాజాగా వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం రూ.10,500 జరిమానా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నాంపల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ట్రాఫిక్ మొబైల్ కోర్టులో తొమ్మిది మంది డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారికి ఒక్కొక్కరికి రూ.10,500 చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. డ్రంకెన్ డ్రైవ్ నేరానికి ఈ స్థాయిలో భారీ ఫైన్ వేయటం హైదరాబాద్ లో ఇదే తొలిసారి. సో.. కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాల్సిన రోజులు వచ్చేసినట్లే. సో.. బీకేర్ ఫుల్. 
Tags:    

Similar News