దురదృష్టం వెంట పడుతుంటే.. ఎంతటి వాడైనా ఏమీ చేయలేడన్న మాటకు తగ్గట్లే.. తాజా సీన్ ఉందని చెప్పాలి. అకౌంట్లో రూ.1800కోట్ల భారీ మొత్తం ఉన్నా.. రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేని చిత్రమైన పరిస్థితి స్టీఫన్ థామన్ అనే వ్యక్తిది. అతగాడి ఉదంతం గురించి వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. చిన్న నిర్లక్ష్యానికి అతడు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ థామస్ ఎవరు? అతనికి రూ.1800 కోట్లు ఎలా వచ్చాయి? పాస్ వర్డు మర్చిపోతే.. రికవరీ ఆప్షన్ ఉంటుంది కదా? అలాంటి సందేహాలు వస్తున్నాయా? అయితే.. మొత్తం విషయాన్ని మొదట్నించి తెలుసుకోవాల్సిందే.
క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ గురించి ఇప్పుడందరికి తెలుసు కానీ.. ఒకప్పుడు దీని గురించి తెలిసినోళ్లు.. దాన్ని నమ్మినోళ్లు చాలా.. చాలా తక్కువ. ఎవరూ నమ్మని కాలంలో థామస్ అనే వ్యక్తి ఈ క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు అతని బిట్ కాయిన్ల సంఖ్య ఏకంగా 7002కు చేరుకున్నాయి. దీని విలువను లెక్కిస్తే మన రూపాయిల్లో ఏకంగా రూ.1800 కోట్లుగా తేలింది. ఇంతవరకు అంతా ఓకే. ఇక్కడి నుంచే సమస్యలు మొదలయ్యాయి.
ఈ భారీ మొత్తాన్ని సేఫ్ గా ఉంచాలన్న జాగ్రత్తలో బిట్ కాయిన్ల కీస్ అన్నింటిని ఐరన్ కీ అనే ఎక్ క్రిప్టెడ్ హార్డ్ డ్రైవ్ లో పెట్టుకున్నాడు. అయితే.. దాన్ని తెరవాలంటే అవసరమైన పాస్ వర్డ్ ను మర్చిపోయాడు. అయితే.. ఈ పాస్ వర్డ్ ను గరిష్ఠంగా పదిసార్లు మాత్రమే ఓపెన్ చేసే వీలు ఉంది. ఇప్పటికే ఎనిమిది సార్లు ఉపయోగించి ఫెయిల్ అయ్యాడు. ఇక.. రెండుసార్లు మాత్రమే వాడే వీలుంది. ఏ మాత్రం తేడా వచ్చినా శాశ్వితంగా ఈ భారీ మొత్తాన్ని కోల్పోయినట్లు అవుతుంది.
బిట్ కాయిన్ తో వచ్చే సమస్య ఏమంటే.. ప్రతి బిట్ కాయిన్ కు ఒక క్రిప్టోగ్రాఫిక్ కీ ఉంటుంది. అది సదరు బిట్ కాయిన్ ఓనర్ కు మాత్రమే తెరిచే వీలు ఉంటుంది. మరెవరికి తెలీదు. ఒకసారి ఈ కీని మర్చిపోతే.. ఇక అంతే సంగతులు. దాన్ని ఎవరూ ఓపెన్ చేయలేరు. ఇదే రీతిలో పాస్ వర్డులు మర్చిపోవటం వల్ల ఏకంగా రూ.9.5లక్షల కోట్ల మొత్తం క్రిప్టో వాలెట్లో ఉండిపోయినట్లుగా ఈ మధ్యనే ఒక రిపోర్టులో వెల్లడైంది. ఇంత భారీ మొత్తం కేవలం పాస్ వర్డ్ మర్చిపోవటం వల్ల అంటే ఏమనాలి?