ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త ప్రాణాలు తీసుకున్నాడు. తనను తాను కాల్చేసుకున్నాడు. తన ఆత్మాహుతితో సరికొత్త నిరసన అగ్గికి తెర తీశాడా? అన్న సందేహాలకు గురయ్యేలా చేశాడు. రాజస్థాన్ లోని వైశాలీ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. గడిచిన కొద్దిరోజులుగా దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై విరక్తి చెంది.. నిరసనగా తన ప్రాణత్యాగానికి వెనుకాడని వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కులం.. మతం ప్రాతిపాదికన రిజర్వేషన్లు.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరు కారుస్తున్నారంటూ నిరనసతో మనస్తాపానికి గురైన సంఘ్ పరివార్ కార్యకర్త 45 ఏళ్ల రఘువీర్ శరణ్ అగర్వాల్ ఆత్మాహుతి చేసుకున్నాడు. తనను తాను కాల్చుకున్న అతను దాదాపు 100 మీటర్ల దూరం భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ పరుగులు తీశాడు. 80 శాతం మేర కాలిన అతనికి చికిత్స చేయించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడు.
చరణ్ కు వైశాలీనగర్ లో మెడికల్ షాపు ఉందని చెబుతున్నారు. కుటుంబపరమైన సమస్యలు కూడా ఆయన ఆత్మాహుతికి కారణంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కులం.. మతం ఆధారంగా రిజర్వేషన్లు.. దళితులు చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చెలరేగిన విధ్వంసం పట్ల చరణ్ కలత చెందినట్లుగా ఉన్నారు. ఆత్మాహుతి తీరు సంచలనంగా మారటంతో పాటు.. కొత్తతరహా అగ్గి రాజుకుంటుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.