సీఎంను చంపితే కోటి రూపాయల బహుమతి

Update: 2017-03-02 11:36 GMT
కేరళలో వామపక్షాలు, బీజేపీ దాని సంబంధిత విభాగాల మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. అయితే.. ఇటీవల కాలంలో అవి మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ కు చెందిన ఓ ఆరెస్సెస్ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సీపీఎం నేత - కేరళ సీఎం పినరయి విజయన్ ను హతమార్చితే కోటి రూపాయల బహుమతి ఇస్తానని ఆ ఆరెస్సెస్ నేత ప్రకటించడం సంచలనంగా మారింది.
    
మధ్యప్రదేశ్ కు చెందిన ఆరెస్సెస్ నేత డాక్టర్ చంద్రావత్ కేరళ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్ ను హతమార్చిన వారికి కోటి రూపాయలు నజరానాగా ఇస్తానంటూ  ప్రకటించిన ఆయన  అవసరమైతే తన ఆస్తులు మొత్తం అమ్మి అయినా సరే ఈ పని పూర్తి చేసినవారికి బహుమతి ఇస్తానన్నారు.  ఉజ్జయినిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో  పాల్గొన్న చంద్రావత్ అక్కడి ఎంపీలు, ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.
    
కాగా, కేరళలో బీజేపీ - ఆర్ ఎస్ ఎస్ నాయకులకు సీపీఎం నాయకులకు మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి.  పినరయి విజయన్ అధికారంలోకి వచ్చాక కేరళలో ఎనిమిది మంది బీజేపీ నాయకులు మృతి చెందారు.  మరోవైపు ఇంతకుముందు విజయన్ కూడా ఆరెస్సెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని చీల్చేందుకు ఆర్ ఎస్ ఎస్ లాంటి సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని, ప్రపంచాన్ని వణికించిన నియంతల విధానాలను ఆర్ ఎస్ ఎస్ ను అనుసరిస్తోందని  అన్నారు. ఈ నేపథ్యంతోనే చంద్రావత్ ఆగ్రహంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News