సాయిరెడ్డి రాజ‌కీయం.. ఈ సారి రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌ర‌ట‌.. రీజ‌న్ ఇదే!

Update: 2022-01-22 07:57 GMT
వైసీపీ రాజ‌స‌భ స‌భ్యుడు.. ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్ త‌ర్వాత‌..అంత రేంజ్‌లో పార్టీ కార్య‌క్ర‌మా లు చేస్తున్న విజ‌య‌సాయి రెడ్డి తాజాగా ఒక ప్రతిపాద‌న పెట్టిన‌ట్టు వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న సాయిరెడ్డి.. స‌భ్య‌త్వం ఈ ఏడాది జూన్ 21తో ముగియ‌నుంది. వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స‌భ్యుల్లో ఈయ‌న ఒక్క‌రికే స‌భ్య‌త్వ కాలం తీరిపోనుంది. దీంతో ఆయ‌న‌ను మ‌రోసారి రెన్యువ‌ల్ చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. ఇదే విష‌యంపై కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది.

అయితే.. తాను రాజ్య‌స‌భ‌కు మ‌రోసారి వెళ్ల‌న‌ని.. సాయిరెడ్డి స్ప‌ష్టం చేసిన‌ట్టు సీనియ‌ర్ల మ‌ధ్య గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ద‌ఫా ఆయ‌న రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని అత్యంత విశ్వ‌స‌నీయ నేత‌లే చెబుతున్నారు. దీనికి కార‌ణం.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయన విశాఖ ఎంపీగా పార్ల‌మెంటుకు పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనికి కూడా ఒక రీజ‌న్ ఉంద‌ని అంటున్నారు. కొన్నాళ్లుగా వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌రాజుకు, విజ‌య‌సాయిరెడ్డికి మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న విష‌యంతెలిసిందే. ఈ క్ర‌మంలో సాయిరెడ్డిని.. నువ్వు ప్ర‌జ‌ల మ‌ధ్య నుంచి గెలిచావా?  నీకు ఆ స‌త్తా ఉందా? అని ఆర్ ఆర్ ఆర్ ప్ర‌శ్నించారు.

దీంతో అప్ప‌టి నుంచి సాయిరెడ్డి లోక్‌స‌భ పై దృష్టి పెట్టార‌ని అంటున్నారు. ర‌ఘురామ రాజు విమ‌ర్శ‌ల కు స‌మాధానం చెప్పేందుకుఅయినా.. తాను లోక్‌స‌భ‌కు పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకోవాల‌ని.. సాయిరెడ్డి భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే గ‌త రెండేళ్లుగా.. ఆయ‌న విశాఖ పై ప్ర‌త్యేక దృష్టిపెట్టారు. అంతేకాదు.. ఇక్క‌డ నుంచి గెల‌వ‌డం ద్వారా.. ఉత్త‌రాంధ్ర జిల్లాల‌పై ప‌ట్టు పెంచుకునేందుకు కూడా ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి ప్ర‌స్తుతం విశాఖ ఎంపీగా.. నిర్మాత‌.. ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ఉన్నారు. ఈయ‌న‌ను అన‌కాప‌ల్లికి పంపించి.. విశాఖ నుంచి సాయిరెడ్డి పోటీ చేయాల‌ని భావిస్తున్నారట‌. అందుకే త‌న‌కు రాజ్య‌స‌భ సీటు రెన్యువ‌ల్ వ‌ద్ద‌ని స్ప‌ష్టంగా చెబుతున్న‌ట్టు సీనియ‌ర్ల నుంచి టాక్ వినిపిస్తోంది. మ‌రి దీనికి సీఎం జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News