ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా ఆగిపోవడంపై రష్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాక్సిన్ అభివృద్ధికి అవలంభించిన విధానంలో లోపాలను ఎత్తిచూపిందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సీఈవో కిరిల్ దిమిత్రియేవ్ కీలక వ్యాఖ్యాలు చేశారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఆయా దేశాలు సరికొత్త, గతంలో పరీక్షించని విధానాలను అనుసరిస్తున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా కోతుల అడినోవైరస్ వెక్టార్ ను వాడడం.. ఎంఆర్ఎన్ఏ సాంకేతికతను వినియోగించడం కొత్త విధానాలు అని ఆయన అభిప్రాయపడ్డారు.
రష్యా తయారు చేస్తున్న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ భిన్నమని.. మానవులలోని అడినో వైరస్ వెక్టార్ ను తాము వినియోగించామని.. అందుకే స్పుత్నిక్ వి అత్యంత సురక్షితమని రష్యా తెలిపింది.
2020-21లో 100 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్ అందజేయనున్నట్లు రష్యా వార్త సంస్థ తెలిపింది. బ్రెజిల్ తోనూ రష్యా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు ఒప్పందం చేసుకుంది. 50 మిలియన్ల డోసులు అమ్మకానికి ఒప్పందం కుదిరిందని రష్యా తెలిపింది.
కాగా తాత్కాలికంగా ఆగిపోయిన ఆక్స్ ఫర్డ్ టీకా ప్రయోగాలు ఆదివారం మళ్లీ ప్రారంభమైన సంగతి తెలిసిందే.