దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ జోరు కొనసాగుతుంది. లక్షల్లో పాజిటివ్ కేసులు , వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే మన ముందున్న ఏకైక దారి .. వ్యాక్సిన్ అందరికి ఇవ్వడమే. అయితే , దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. ఫూణెకు చెందిన సీరం సంస్థ తయారు చేస్తున్న కోవిషీల్డ్, హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ మాత్రమే దేశంలో అందుబాటులో ఉన్నాయి. వాటి ఉత్పత్తి కూడా తక్కువగా ఉండటం తో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.
ఈ నేపథ్యంలోనే రష్యా తయారు చేసిన స్పుత్నిక్ - వీ వ్యాక్సిన్ కి మన కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తోన్న రష్యా కి చెందిన స్పుత్నిక్ - వీ వ్యాక్సిన్ వచ్చే వారం నుంచి దేశీ మార్కెట్ లోకి అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే కొన్ని డోసుల వ్యాక్సిన్ ఢిల్లీ కి చేరుకున్నట్టు కేంద్రం కూడా ప్రకటించింది. ఈ టీకాను భారత్ కు చెందిన రెడ్డీ ల్యాబ్ అందివ్వబోతుంది. మొదటగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న టీకాలని అమ్ముతారు. అలాగేవీలైనంత త్వరగా రెడ్డీ ల్యాబ్స్ తాను సొంతంగా ఉత్పత్తి ప్రారంభించబోతుంది. దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్ కు ఒక ధర, తాను స్వయంగా ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ కు మరో ధర ఉంటుందన్న విషయాన్ని డాక్టర్ రెడ్డీ ల్యాబ్ వెల్లడించింది. వచ్చే వారం నుంచి దేశీ మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్న ఈ టీకా ధరను రూ. 995గా డాక్టర్ రెడ్డీస్ సంస్థ నిర్ణయించింది. అసలు వెల రూ.948కి 5 శాతం జీఎస్టీతో కలిపి ఒక డోసుకు సుమారుగా రూ.995.40గా ధర ఉండే అవకాశం ఉంది. స్థానికంగా ఈ టీకా ఉత్పత్తి మొదలైతే ధర కొంత వరకు తగ్గొచ్చునని స్పుత్నిక్ ను లోకల్ గా తయారు చేయనున్న రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తెలిపింది. సమయానుగుణంగా డిమాండ్ మేర టీకా డోసులను అందించేందుకు తమ భాగస్వామ్య కంపెనీలతో కలసి పని చేస్తున్నామని స్పష్టం చేసింది. అయితే , మొత్తం అంతా బాగుంది కానీ, ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ మీద కూడా ఆ జీఎస్టీ వాయింపు ఏంటి స్వామి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.