ర‌ష్యా అధినేత పుతిన్ సీక్రెట్ ల‌వ‌ర్ ఈమేనా?

Update: 2022-07-11 08:30 GMT
ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్.. ప్ర‌పంచంలోనే శ‌క్తివంత‌మైన నేత‌ల్లో ఒక‌రు. దాదాపు గ‌త 25 ఏళ్లుగా ర‌ష్యా అధ్యక్షుడిగా, ప్ర‌ధాన‌మంత్రిగా పుతినే ఉండ‌టం ఇందుకు నిద‌ర్శ‌నం. ప్ర‌స్తుతం ఒక‌ప్ప‌టి సోవియ‌ట్ యూనియ‌న్ లో భాగంగా ఉండి.. ఇప్పుడు దేశంగా ఉన్న ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధ భేరి మోగించిన సంగతి తెలిసిందే. యుద్ధం ప్రారంభించి ఐదు నెల‌ల అయినా పుతిన్ ఆప‌డం లేదు. ఈ క్ర‌మంలో అమెరికా, యూకే, కెన‌డా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ త‌దిత‌ర దేశాల ఆంక్ష‌ల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా పుతిన్ ముందుకే వెళ్తున్నారు.

కాగా రాజ‌కీయాల్లోకి రాక ముందు పుతిన్ ర‌ష్య‌న్ గూఢ‌చార సంస్థ.. కేజీబీలో గూఢ‌చారిగా ప‌నిచేశారు. ఎంతోమంది అమ్మాయిల‌తో స‌ర‌స‌, శృంగారాలు నిర్వ‌హించార‌ని మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయి. తాజాగా పుతిన్ సీక్రెట్ ల‌వ‌ర్ ఈమేనని.. ఆమె ప్ర‌స్తుతం గ‌ర్భ‌వతి అని మీడియాలో క‌థ‌నాలు షికారు చేస్తున్నాయి.

69 ఏళ్ల వ‌య‌సులో పుతిన్​ మరోసారి తండ్రి కాబోతున్నార‌ని.. ఆయనకు కుమార్తె పుట్టబోతోంది అనే వార్త  ప్ర‌ధాన మీడియాతోపాటు సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. ఆయ‌న ప్రియురాలు మాజీ జిమ్నాస్ట్​ అలీనా కబయెవా ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి​ అని వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా జరిపిన లింగ నిర్దారణ పరీక్షల్లో.. ఆమెకు ఆడపిల్ల పుట్ట‌బోతున్న‌ట్టు తేలింద‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

ఒలింపిక్​ బంగారు ప‌త‌క విజేత కూడా అయిన‌ అలీనా క‌బ‌యెవాకు పుతిన్​ వల్ల ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నట్లు మీడియా క‌థ‌నాలు చెబుతున్నాయి. 2015లో మొద‌టి కుమారుడు, 2019లో మాస్కోలో రెండో కుమారుడు జన్మించాడని పేర్కొన్నాయి. ఈ విష‌యం గురించి ఎవ‌రికీ తెలియ‌కుండా అలీనాను పుతిన్ రహస్యంగా స్విట్జర్లాండ్ లో కొన్నేళ్ల‌పాటు దాచిపెట్టార‌ని కూడా వివ‌రిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ర‌ష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో అలీనా క‌బ‌యెవాను ర‌ష్యాలోని సైబీరియాలో ఉన్న అండ‌ర్ గ్రౌండ్ సిటీ బంక‌ర్ లో ర‌హ‌స్యంగా ఉంచిన‌ట్టు ప‌లు మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి.  తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ప్రపంచవ్యాప్తంగా పుతిన్ - అలీనా ప్రేమాయణం, ఆమె క‌డుపు సెన్సేష‌న‌ల్ వార్త‌గా మారింది.
Tags:    

Similar News