ఉక్రెయిన్ పౌరులందరికీ రష్యా గుడ్ న్యూస్

Update: 2022-07-12 05:32 GMT
ఉక్రెయిన్ పై రష్యా రెండంచెల విధానాన్ని అనుసరిస్తున్నట్లుంది. ఒకవైపు యుద్ధం ద్వారా ఉక్రెయిన్ ను కోలుకోనీయకుండా దెబ్బ కొడుతోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ పౌరులకు రష్యా పౌరసత్వాన్ని ఇచ్చేస్తోంది. ఉక్రెయిన్ పౌరులందరికీ రష్యా పౌరసత్వం ఇచ్చేట్లుగా తాజాగా రష్యా అధినేత వ్లాదిమర్ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన తర్వాత కొన్ని లక్షలమంది ఉక్రెయిన్ జనాభా ఇప్పటికే రష్యాలోకి వెళ్ళిపోయారు.

అయితే ఇపుడు రష్యాలో ఉన్న ఉక్రెయిన్ జనాలంతా అనధికారికంగా ఉన్నట్లే లెక్క. ఎందుకంటే యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాలు సుమారు 50 లక్షల మంది రష్యాతో పాటు హంగేరి, పోలండ్, రుమేనియా తదితర దేశాల్లోకి కూడా వెళ్ళిపోయారు. పై దేశాల్లోకి వెళ్ళటానికి రష్యాలోకి వెళ్ళటానికి చాలా తేడా ఉంది.

ఎలాగంటే అవటానికి రష్యా-ఉక్రెయిన్ రెండు దేశాలే అయినా రెండు దేశాల్లోని జనాలు అటు ఇటు రెగ్యులర్ గా రాకపోకలు సాగిస్తునే ఉంటారు. కారణం ఏమిటంటే 1990వ దశకం వరకు రష్యాలో ఉక్రెయిన్ ఒక పెద్ద నగరమన్న విషయం తెలిసిందే.

యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమవటంతో  చాలా రాష్ట్రాలు దేనికదే విడిపోయి స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్నాయి. అలాగే ప్రకటించుకున్న దేశాల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి. కాబట్టి రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు చాలా బలంగా ఉన్నాయి.

ఈ కారణంతోనే ఇపుడు ఉక్రెయిన్ జనాలందరికీ రష్యా పౌరసత్వాన్ని ఇచ్చేయాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటివరకు అంటే యుద్ధం మొదలైన దగ్గర నుంచి సుమారు 7.5 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలకు రష్యా పాస్ పోర్టులు జారీచేసింది.

మొత్తం ఉక్రెయిన్ జనాభాలో 18 శాతం మందికి రష్యా పాస్ పోర్టులు ఇప్పటికే ఉన్నాయి. అంటే రెండుదేశాలు భౌగోళికంగా మాత్రమే వేరుకానీ ఇతరత్రా అంతా ఒకటే అన్న భావన రెండు దేశాల్లోని జనాల్లో చాలాబలంగా ఉంది. సో దాన్ని ఆధారంగా చేసుకునే ఇపుడు ఉక్రెయిన్ జనాలకు రష్యా పౌరసత్వం ఇచ్చేస్తోంది. ఒకసారి పౌరసత్వం తీసుకోవటం మొదలైతే ఇక ఉక్రెయిన్లో ఎంతమంది జనాలుంటారో చూడాల్సిందే.
Tags:    

Similar News