విశాఖపట్నంలో మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి ఆనుకొని ఉన్న గదిని జీవీఎంసీ అధికారులు కూల్చడం ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూల్చిన అధికారులపై సబ్బం హరి రెచ్చిపోయి తిట్ల వర్షం కురిపించాడు. రాస్కెల్, వాడు అని మాట్లాడారు. ఇవి దుమారం రేపాయి.
ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలపై వెనక్కితగ్గారు సబ్బం హరి. నేను నిన్న ఒక సామాన్యుడిలా సహనం కోల్పోయి మాట్లాడానని మాజీ ఎంపీ .. ఆవేశంలో తిట్టినందుకు సారీ క్షమించండని అధికారులను కోరారు. ఎవరికి భయపడి ఈ మాటలు చెప్పడం లేదని.. తన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు తెలిపారు.
కోపంలో అలా మాట్లాడానన్న సబ్బం హరి.. ఇక ముందు అలాంటి పదాలు వాడనని.. నన్ను ఇష్టపడే వాళ్లకే చెబుతున్నానని అన్నారు.
తన స్థలం కూల్చివేతపై కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ఈ స్థలంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఇళ్లు కట్టలేదని ఆయన వివరణ ఇచ్చారు. గతంలో ప్లాన్ అప్రూవుల్ పెట్టినప్పుడు అన్నీ కలిపి పెట్టానని .. వాటిని అధికారులకు పంపిస్తానని సబ్బం హరి తెలిపారు.