సచిన్‌ కు అవమానం

Update: 2015-11-13 10:34 GMT
క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కు బ్రిటీష్‌ ఎయిర్‌ వేస్‌ లో అవమానం జరిగింది. సచిన్‌  లగేజీని పోగొట్టిన ఎయిర్‌ వేస్‌ సిబ్బంది ఆ విషయం అడిగేసరికి అసలు సచిన్‌ ఎవరని ప్రశ్నించారు. అంతేకాదు.. బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది సచిన్‌ తో దురుసుగా ప్రవర్తించారు కూడా. దీంతో ఆగ్రహించిన సచిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాధారణంగా కూల్ గా ఉండే సచిన్ బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది తీరు కారణంగా ఆగ్రహంతో ఊగిపోయారట. అందేకాదు.. తన పట్ల, తన కుటుంబం పట్ల బ్రిటిష్ ఎయిర్ వేస్ వ్యవహరించిన తీరుపై ఆయన  ట్విట్టర్ లోనూ అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహం - అసంతృప్తి - ఒత్తిడికి లోనయ్యానని ఆయనే చెప్పారు.

ప్రస్తుతం ఆల్ స్టార్ క్రికెట్ టోర్నీ కోసం సచిన్ టెండుల్కర్ అమెరికాలో ఉన్నారు. తన కుటుంబ సభ్యులకు సీట్లు కేటాయించడంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ట్విట్టర్ వేదికగా సచినా ఆరోపణలు గుప్పించారు. సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ తన కుటుంబ సభ్యుల టికెట్లు నిర్ధారించకుండా ఆ విమానయాన సంస్థ తమను ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ వ్యవహార సరళితో తాను అసహనానికే కాక అసంతృప్తి, ఆగ్రహానికి కూడా గురయ్యానని పేర్కొన్నారు. అంతేకాక తన సామానును తాము సూచించిన గమ్యానికి కాకుండా వేరే ప్రాంతానికి తరలించిందన్నారు. కాగా సచిన్ కామెంట్లపై బ్రిటిష్ ఎయిర్ వేస్ కూడా వేగంగానే స్పందించింది. లగేజీ వివరాలు పూర్తి అడ్రెస్ ఇస్తే అక్కడికే చేరుస్తామని పేర్కొంది. సచిన్‌ ను క్షమాపణలు కోరింది.

కాగా సచిన్ ను  పూర్తి పేరు - వివరాలు అడిగిన  బ్రిటిష్ ఎయిర్ వేస్ పైన ట్విట్టర్ లో అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. సచిన్ పూర్తి పేరు తెలియదా అన్న విధంగా వారు స్పందిస్తున్నారు. మాకు ఒబామా - మోడీ తెలుసునని, అలాగే క్రికెట్ దేవుడు సచిన్ అంతకంటే ఎక్కువ తెలుసునని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. సచిన్ పూర్తిపేరు ఇదీ అంటూ జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ట్డిట్టర్ లో స్పందించారు.
Tags:    

Similar News