భారత క్రికెట్ జట్టు కోచ్ గా రవిశాస్త్రి ఎంపికపై క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలిసారి స్పందించాడు. తాము ప్రధాన కోచ్ - సహాయక కోచ్ లను పూర్తి పారదర్శక పద్ధతిలో ఎంపిక చేశామన్నాడు. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)పై వస్తున్న విమర్శలపై సచిన్ తీవ్రస్థాయిలో స్పందించాడు. ఈ మొత్తం ప్రక్రియను బయట పెట్టాలని సీఓఏ (పాలకుల కమిటీ)కి ఘాటైన లేఖను రాశాడు. సహాయక సిబ్బంది ఎంపిక తన పరిధిలోనిదన్న రవిశాస్త్రి వ్యాఖ్యలతో పాటు మీడియాలో తమకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలు తమను ఎంతగానో బాధించాయని సచిన్ అన్నాడు.
మంచి ఉద్దేశంతో తాము ప్రధాన కోచ్ - సహాయక కోచ్‌లను ఎంపిక చేస్తే - తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సచిన్ - లక్ష్మన్ - గంగూలీ నేతృత్వంలోని సీఏసీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లోని ముగ్గురు సభ్యులు ఎవరికి వారు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ)తో పాటు బీసీసీఐ తాత్కాలిక సెక్రటరీ అమితాబ్ చౌదరికి లేఖలు రాశారు.
"మేము మా పరిధి దాటి వ్యవహరించామని, ద్రవిడ్ - జహీర్ లను కోచ్ కు బలవంతంగా అంటగట్టామని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు మమ్మల్ని బాధించాయి. అసంతృప్తికి గురి చేశాయి. ఈ వార్తలు అబద్ధమని మనకు తెలుసు. అందుకే క్రికెట్ అభిమానులకు కూడా నిజమేంటో తెలియాల్సిన అవసరం ఉంది" అని సచిన్ తన లేఖలో రాశాడు. రవిశాస్త్రిని సంప్రదించాకే రాహుల్ ద్రవిడ్ - జహీర్ ఖాన్ లను సీఏసీ ఎంపిక చేసిందని పేర్కొంది.
ఈ విషయాన్ని మరింత పెద్దది చేయాలని అనుకోవడం లేదని, అందుకే ఈ విషయంపై మీరు స్పందించాలని కోరుతున్నామని సచిన్ తెలిపాడు. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కోచ్ ఎంపిక ప్రక్రియ చాలా సావధానంగా, సామరస్యంగా జరిపామన్నాడు. ఈ ఎంపికపై అనుమానాలను బహిరంగంగా నివృత్తి చేయాలని కోరుకుంటున్నామని సచిన్ అన్నాడు. జట్టు సహాయక సిబ్బంది ఎంపిక తన ఇష్టమని, ఆ విషయంలో తానే నిర్ణయం తీసుకుంటానని రవిశాస్త్రి గురువారం మీడియాతో అన్నాడు. ఈ నేపథ్యంలో సచిన్ లేఖ కలకలం రేపుతోంది. ఈ లేఖపై సీఓఏ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.